దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వాహనంపై దాడి
రచయిత,దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై గురువారం ఉదయం దిల్ షుక్ నగర్ లో దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై తెరాస కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో శ్రీనివాస్ వాహనం దిగి పరుగు పెట్టారు. ఈ సంఘటనతో హైదరాబాదులోని తెలుగు సినీపరిశ్రమపై తెరాస టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యనిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో సీమాంధ్రకు చెందిన నటులు, దర్శకులు, రచయితలను... ఇలా ఒక్కొక్కరిపై విడివిడిగా దాడి జరిగే అవకాశం ఉందంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి, మల్లీశ్వరీ, మన్మధుడు వంటి చిత్రాలుకు కథలు అందించారు. అలాగే అతడు, జల్సా చిత్రాలను డైరక్ట్ చేసారు.
ఇక మహేశ్ బాబు చిత్రం షూటింగ్ పై కూడా దాడి చేసి ఆపు చేసిన సంగతి తెలిసిందే. గురువారం వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుండగా తెరాస కార్యకర్తలు షూటింగ్‌ను అడ్డుకున్నారు. అక్కడ షూటింగ్ సామగ్రిని ధ్వంసం చేసారు. సమాచారం. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. మరో ప్రక్క హైదరాబాదులోని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ దాడిలో సుమారు 2 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఏదైమైనా రాష్ట్రంలో రాజకీయాలకు సినిమాలకు లింకుపెట్టి దాడులకు తెగబడటం శోచనీయమని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











