మోహన్ బాబు స్కూల్ పైనా దాడి
ఘట్ కేసర్ మండలం పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో సినీనటుడు మోహన్‌బాబుకు చెందిన 'శ్రీ విద్యానికేతన్' పాఠశాలను తెలంగాణాకు చెందిన ఆందోళనకారులు దాడి చేసారు. ఆ స్కూల్ ని పూర్తి స్ధాయిలో ధ్వంసం చేశారు. ఒక్కసారిగా పాఠశాల వైపు దూసుకొచ్చిన ఆందోళన కారులు బయటి అద్దాలను పగులగొట్టారు. లోనికి ప్రవేశించి కంప్యూటరు పరికరాలు, ఫ్యాక్స్ మిషన్, పూల కుండీలు, కుర్చీలను ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన సిబ్బందిని కొట్టారు. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సును రప్పించి పాఠశాల ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్ బాబు సమైఖ్యాంద్రకు అనుకూలంగా మాట్లాడారని ఆయన కుమారుడు మనోజ్ షూటింగ్ పైనా దాడి చేసిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిస్పందనగా మోహన్ బాబు, ఆయన కుమార్తె లక్ష్మీ ప్రసన్న మీడియా సమావేసం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే ఆయన పెద్ద కుమారుడు విష్ణు నటించిన సలీం చిత్రాన్ని సైతం నైజాం ఏరియాలో ప్రదర్శన ఆపుచేసారు.


Click it and Unblock the Notifications











