పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ టీఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అంటూ!
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. నిన్నకాక మొన్న సహస్రావధాని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు పుష్ప సినిమా తీసిన దర్శకుడు, హీరో మీద సంచలన వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు అదే బాటలో తెలంగాణ నాయకుడు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కొట్టాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ఉత్తరాదిన కూడా
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. డిసెంబర్ 17వ తారీఖున విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. దక్షిణాది భాషలతో పాటు ఉత్తరాదిన కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించడమే కాక వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

350 కోట్లు
ఇక పుష్ప కలెక్షన్స్ ను కనుక మనం పరిశీలిస్తే 7 వారాల్లో ఆంధ్ర, తెలంగాణలో 'పుష్ప'కు రూ. 85.35 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 11.62 కోట్లు, తమిళనాడులో రూ. 11.45 కోట్లు, కేరళలో రూ. 5.52 కోట్లు, హిందీలో రూ. 42.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.22 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.50 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 49 రోజుల్లో రూ. 181.00 కోట్లు షేర్‌తో పాటు రూ. 350.20 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది.

ఏడాది చివర్లో
కన్నడ నటుడు ధనుంజయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, అజయ్ ఘోష్, అజయ్, శత్రు లాంటి వారు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక ఎర్రచందం స్మగ్లర్ పాత్రలో నటించాడు. రాయలసీమ జిల్లాలకు చెందిన శేషాచలం అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే కూలీగా కెరీర్ ప్రారంభించిన పుష్ప చివరికి ఎంత దాకా ఎదిగాడు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటికే మొదటి భాగం విడుదల కాగా రెండో భాగాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కడిగిపారేస్తాను అంటూ
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రలో నటించడం మీద ఇప్పుడు విమర్శలు తలెత్తుతున్నాయి. స్మగ్లర్ పాత్రలో నటించిన నటుడు తగ్గేదే లే అనడం ఏ మాత్రం బాలేదు అని అలా ఒక ఎర్రచందం స్మగ్లర్ పాత్ర పోషించిన హీరో చెబుతూ ఉంటే ఆ సినిమా ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు అని గరికపాటి నరసింహారావు ప్రశ్నించారు. ఆ సినిమా దర్శకుడిని, హీరోని తన వద్దకు తీసుకు వస్తే కడిగిపారేస్తాను అంటూ ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రెండు రోజుల నుంచి ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉండగా తాజాగా ఇదే విషయం మీద చెందిన టీఆర్ఎస్ నేత ఒకరు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

చెప్పుతో కొట్టాలి
టీఆర్ఎస్ నేత, తెలంగాణ గాయకుడు సాయి చంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పుష్ప సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కూల్ పిల్లలు అల్లరి చేస్తూ ఉండడంతో పుషలో హీరో అనుకుంటున్నాడు వాడు, వాడిని చక్కగా కుర్చోపెట్టండి, ఈ హౌలేగాళ్ళందరినీ తగ్గేదే లేదు అంటూ హీరోలు చేసిన తర్వాత పిలగాళ్లను కంట్రోల్ చేసుడు కష్టమైందని.. ఈ సినిమాలను తీసే ఎదవలను చెప్పుతో కొట్టాలి ఫస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. మరి పుష్ప యూనిట్ దీనికి ఏమైనా స్పందిస్తుంది ఏమో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











