దాడులకు కారణం మోహన్ బాబు సవాలే
'సమైక్యాంధ్ర' గొడవను నెత్తికి ఎత్తుకుని..రాయలసీమ బిడ్డనంటూ సవాలు చేయడం వల్లనే సినిమా షూటింగ్‌ల పై దాడులు జరుగుతున్నాయని హైదరాబాద్ ఫిలిం డెవలప్‌మెంట్ సొసైటీ పేర్కొంది. ఈ మేరకు సొసైటీ వైస్‌చైర్మన్ గొట్టిముక్కల పాండురంగారావు మాట్లాడుతూ..తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు సీనియర్ నటులు, రామోజీరావు వంటి వారికి లేని సమస్య మోహన్‌బాబు ఒక్కడికే వచ్చినట్టుగా 'సమైక్యాంధ్ర' గొడవను నెత్తికి ఎత్తుకుని..రాయలసీమ బిడ్డనంటూ సవాలు చేయడం వల్లనే సినిమా షూటింగ్‌ల పై దాడులు జరుగుతున్నాయని హైదరాబాద్ ఫిలిం డెవలప్‌మెంట్ సొసైటీ పేర్కొంది. అలాగే గీతా ఆర్ట్స్ కార్యాలయంపై దాడులు వంటివి దురదృష్టకర సంఘనగా పేర్కొన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్‌లో స్థిరపడిన ఏ సినీనటుడైనా, దర్శకుడైనా, నిర్మాతయినా ప్రస్తుత ఉద్యమాల గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. రాజకీయరంగం గురించి మాట్లాడదల్చుకుంటే సినిమా రంగాన్ని వదిలిపెడితే మంచిదని సూచించారు. సినిమా రంగంలో ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడితే గీతా ఆర్ట్స్‌పై దాడి వంటి సంఘటనలు తప్పవని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











