కె.రాఘవేంద్రరావు భూమిపై పిటిషన్

1984లో రాఘవేంద్రరావు, ఆయన తండ్రి; సంగీత దర్శకుడు చక్రవర్తి తదితరులకు ఎకరా రూ.8500 చొప్పున 2.20 ఎకరాలను కేటాయించారు. దీన్ని సినిమా పరిశ్రమ అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం జీవో 754 జారీ చేసింది. ఇందులో రికార్డింగ్, రీరికార్డింగ్, డబ్బింగ్ థియేటర్, ఎడిటింగ్, ఔట్‌డోర్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. 2002లో రాఘవేంద్రరావు తండ్రి చనిపోయారు. సదరు భూమిలో వాణిజ్య నిర్మాణాలు చేపడుతుండగా 2006లో పి.జనార్దన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అది పెండింగ్‌లో ఉండగానే భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్లు జీవోలు జారీ అయ్యాయి. వాటిపై రాఘవేంద్రరావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోరాదంటూ అధికారులు మరోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారని, వాటిపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తెలిపారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో సినీ ప్రముఖులను అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతోనే చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వంతో పాటు రాఘవేంద్రరావు, కృష్ణమోహన్, సంగీత దర్శకుడు చక్రవర్తి కుమారుడు తదితరులను చేర్చారు.


Click it and Unblock the Notifications











