For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయ్‌ దేవరకొండతో ముద్దు సమస్య కాదు... రష్మిక-రక్షిత్ బ్రేకప్‌కు అసలు కారణం ఇదే!

|
Rashmika Kissing Vijay Devarakonda! Truth Behind Rashmika,Rakshit Breakup Revealed || Filmibeat

ఛలో, గీత గోవిందం లాంటి సినిమాలతో తెలుగులో పాపులారిటీ దక్కించుకుని వరుస సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న... కన్నడ మూవీ 'కిరిక్ పార్టీ' ద్వారా హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఎంగేజ్మెంట్ 2017లో జరుపుకున్నారు. 'గీత గోవిందం' సినిమా విడుదల వరకు అంతా బాగానే ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని ముద్దు సీన్లు లీక్ కావడంతో అభిమానులు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ విజయ్ దేవరకొండతో రష్మిక కిస్సింగ్ సీన్ చేయడం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే మరి వీరు విడిపోవడాని కారణమేంటి? తాజాగా ఇందుకు సంబంధించిన వాస్తవాలు బయటకు వచ్చాయి.

రష్మిక ఆ సీన్లు చేయడంపై రక్షిత్ ఏమన్నారంటే..

‘‘ఆ సీన్లు చేసేపుడు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో నాకు తెలుసు. సినిమాల్లో ఉన్నపుడు అవి తప్పదు. ఆ స్థానంలో నేను ఉన్నా అలాగే చేస్తాను. అదే పని నేను చేస్తే పెద్ద ఇష్యూ అయ్యేది కాదు.. కానీ గర్ల్ చేయడం వల్ల దాన్ని చాలా మంది జడ్జ్ చేస్తున్నారు. ఈ లోకం తీరే అంత''... అని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్

గీత గోవిందం సినిమా విడుదలకు మూడు రోజుల ముందు ఆ సీన్లు లీక్ కావడంతో అవి వైరల్ అయ్యాయి. దీంతో చాలా మంది రష్మికను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రాంభించారు. ఒకరితో ఎంటేజ్మెంట్ అయ్యాక ఇలాంటి సీన్లు చేస్తావా అంటూ విమర్శించారు.

రూమర్స్ మొదలయ్యీయి

‘గీత గోవిందం' చిత్రం తెలుగుతో పాటు కన్నడలో కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకే విజయ్, రష్మిక మధ్య ఎఫైర్ మొదలైందని, దీనిపై రక్షిత్ శెట్టి ఆగ్రహంగా ఉన్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.

రెండు ఫ్యామిలీస్ మధ్య అపార్థాలు

ఓ వైపు ‘గీత గోవిందం' చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసి విజయం సాధించింది. మరో వైపు రక్షిత, రక్షిత్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. రష్మిక మీద వచ్చిన రూమర్స్ వల్ల రక్షిత్ శెట్టి ఫ్యామిలీ చాలా అప్ సెట్ అయిందట. ఈ క్రమంలో.. ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా నువ్వు అలాంటి కిస్సింగ్ సీన్లు చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావంటూ రక్షిత్ ఫ్యామిలీ రష్మిక‌ను ప్రశ్నించడం మొదలు పెట్టిందట.

రష్మిక ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయిందంటే

రక్షిత్ శెట్టి ఫ్యామిలీ తమ కూతురిని అలా ప్రశ్నిండంతో రష్మిక కుటుంబం తట్టుకోలేక పోయిందట. తన వృత్తిలో భాగంగా తమ కూతురు చేసిన పనిని తప్పు బట్టడం సరైంది కాదంటూ రష్మిక తల్లి ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగినట్లు కన్నడ మీడియా సంస్థల కథనం.

ఫ్యామిలీస్‌ను ఒప్పించానికి ఇద్దరూ ట్రై చేశారు, కానీ

రష్మిక, రక్షిత్ మధ్య ఈ విషయంలో ఎలాంటి గొడవ లేదు కానీ.. ఇది రెండు ఫ్యామిలీస్ మధ్య అపార్థాలు పెరగడానికి కారణమైంది. తమ రిలేషన్ కాపాడుకోవడానికి ఇద్దరూ వారి కుటంబ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నించినట్లు సమాచారం.

బ్రేకప్ రూమర్స్

కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ఇద్దరూ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈక్రమంలోనే మరో వైపు వీరు విడితున్నట్లు, బ్రేకప్ అయినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. చివరకు రష్మిక, రక్షిత్ పరిస్థితి అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది.

రిలేషన్ కంటే కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక

ఇటు ఫ్యామిలీలో గొడవలతో సతమతం అయిన రష్మిక... చివరకు అతడితో రిలేషన్ కంటే కెరీరే ముఖ్యమని భావించిందని, ఈ క్రమంలోనే ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడానికి సుముఖత చూపిందని, అలా రష్మిక, రక్షిత్ విడిపోయినట్లు తెలుస్తోంది.

English summary
When Rakshit Shetty featured Rashmika Mandanna in Kirik Party, everybody wished to see them together in real life. Such was their chemistry. The fans' dream came true when they made their relationship official by getting engaged in July, 2017. All was fine until Geetha Govindam happened. Soon after an intimate scene from the film leaked, Raskhit's fans began bashing the actress. However, in a telephonic interview with Tv9, Rakshit Shetty has revealed that he had no issues with Rashmika kissing Vijay Devarakonda. Finally, the actual truth behind their breakup has been revealed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more