Don't Miss!
- News పొలిటికల్ పంచ్, ఓటు కోసం మాట మార్చిన సీఎం, కాలేజ్ అమ్మాయి కేసు కోసం స్పెషల్ కోర్టు!
- Sports CSK vs LSG: అందుకే రచిన్ రవీంద్రను పక్కనపెట్టాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొత్త కోణం.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో అవన్నీ అవాస్తవాలేనా?
రామ్ గోపాల్ వర్మ మూవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ముందే కాదు.. విడుదల తర్వాత కూడా పలు వివాదాల్లో మునిగి తేలుతోంది. ఈ చిత్రంలో చంద్రబాబును నెగెటివ్ యాంగిల్లో చూపారని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేశారని కేసు వేయడంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే.
తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి గురించి చెప్పిన విషయాలన్నీ నిజం కాదని, సినిమాలో చూపినట్లుగా లక్ష్మీ పార్వతి అంత మంచి వ్యక్తి ఏమీ కాదంటూ కోటి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.
లక్ష్మీ పార్వతిపై కేసు
కొంతకాలంగా లక్ష్మీ పార్వతి అనుచరుడిగా ఉంటున్న కోటి మీడియా ముందుకు వచ్చే ముందు... గుంటూరు జిల్లా వినుకొండ పోలీసులను ఆశ్రయించాడు. లక్ష్మీ పార్వతి తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తూ ఫిర్యాదు చేశారు.
సినిమాను చూసి మోసపోవద్దు
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించిన లక్ష్మీపార్వతికి... నిజ జీవితంలో లక్ష్మీ పార్వతికి చాలా తేడా ఉందని కోటీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా చూసి ప్రజలు మోసపోకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఈ విషయాన్ని బయట పెట్టినట్లు తెలిపారు.
వాట్సాప్ సందేశాలతో సంచలనం
ఈ సందర్భంగా కోటి తన వద్ద ఉన్న వాట్సాప్ సందేశాలను మీడియాకు చూపించారు. సదరు వాట్సాప్ సందేశాల్లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గురించి చెడుగా వ్యాఖ్యలు చేసినట్లు ఉండటం గమనార్హం. ఓ వైపు ఏపీలో సినిమా రిలీజ్ ఆగిపోయిన వేళ... కోటి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.
రిలీజ్ తర్వాత ప్రభావం?
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో కోటి చేస్తున్న వ్యాఖ్యలు రేపు సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా ప్రభావం చూపుతుందా? ఆల్రెడీ తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో సినిమా రన్ అవుతున్న నేపథ్యంలో కలెక్షన్లపై నెగెటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? అనే చర్చ మొదలైంది. ఈ కేసు చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.