twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త కోణం.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో అవన్నీ అవాస్తవాలేనా?

    |

    రామ్ గోపాల్ వర్మ మూవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ముందే కాదు.. విడుదల తర్వాత కూడా పలు వివాదాల్లో మునిగి తేలుతోంది. ఈ చిత్రంలో చంద్రబాబును నెగెటివ్ యాంగిల్‌లో చూపారని, ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేశారని కేసు వేయడంతో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చిత్రం ఆగిపోయిన సంగతి తెలిసిందే.

    తాజాగా మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు రెండో భార్య లక్ష్మీ పార్వతి గురించి చెప్పిన విషయాలన్నీ నిజం కాదని, సినిమాలో చూపినట్లుగా లక్ష్మీ పార్వతి అంత మంచి వ్యక్తి ఏమీ కాదంటూ కోటి అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు.

    లక్ష్మీ పార్వతిపై కేసు

    లక్ష్మీ పార్వతిపై కేసు

    కొంతకాలంగా లక్ష్మీ పార్వతి అనుచరుడిగా ఉంటున్న కోటి మీడియా ముందుకు వచ్చే ముందు... గుంటూరు జిల్లా వినుకొండ పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు. ల‌క్ష్మీ పార్వ‌తి త‌న‌ను లైంగికంగా వేధింపులకు గురి చేస్తోందని ఆరోపణలు గుప్పిస్తూ ఫిర్యాదు చేశారు.

    సినిమాను చూసి మోసపోవద్దు

    సినిమాను చూసి మోసపోవద్దు

    లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించిన లక్ష్మీపార్వతికి... నిజ జీవితంలో లక్ష్మీ పార్వతికి చాలా తేడా ఉందని కోటీ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా చూసి ప్రజలు మోసపోకూడదనే ఉద్దేశ్యంతోనే తాను ఈ విషయాన్ని బయట పెట్టినట్లు తెలిపారు.

    వాట్సాప్ సందేశాలతో సంచలనం

    వాట్సాప్ సందేశాలతో సంచలనం

    ఈ సందర్భంగా కోటి తన వద్ద ఉన్న వాట్సాప్ సందేశాలను మీడియాకు చూపించారు. సదరు వాట్సాప్ సందేశాల్లో లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గురించి చెడుగా వ్యాఖ్యలు చేసినట్లు ఉండటం గమనార్హం. ఓ వైపు ఏపీలో సినిమా రిలీజ్ ఆగిపోయిన వేళ... కోటి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.

    రిలీజ్ తర్వాత ప్రభావం?

    రిలీజ్ తర్వాత ప్రభావం?

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో కోటి చేస్తున్న వ్యాఖ్యలు రేపు సినిమా రిలీజ్ తర్వాత ఏమైనా ప్రభావం చూపుతుందా? ఆల్రెడీ తెలంగాణ, ఇతర ప్రాంతాల్లో సినిమా రన్ అవుతున్న నేపథ్యంలో కలెక్షన్లపై నెగెటివ్ ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? అనే చర్చ మొదలైంది. ఈ కేసు చివరకు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

    English summary
    Sexual harassment case has been filed on Lakshmi Parvathi. A man identified as Koti registered a case on Lakshmi Parvathi alleging that she has been harassing him and has been approaching him inappropriately. Koti also revealed that ‘‘The truth is not shown in Lakshmis NTR movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X