For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ సినిమాలో దేవిశ్రీ ఎక్స్‌పర్మెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు.

    ఇందులో ఓ సాంగుపై దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌పర్మెంట్ మొదలు పెట్టాడు. దీని గురించి తన మైక్రో బ్లాగింగ్ సైట్లో ప్రస్తావిస్తూ...'మహేష్ బాబు, సుకుమార్ సినిమాకు సంథింగ్ స్పెషల్‌గా రాడికల్లీ డిఫరెంట్‌గా ట్యూన్స్ ట్రై చేస్తున్నాను. ఇది తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా ఉండబోతోంది. కొత్తదనాన్ని ఆడియన్స్ స్వాగతిస్తారని తన నమ్మకం' అంటూ పేర్కొన్నారు.

    సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి.

    మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌ బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

    English summary
    "For Sukumar-Mahesh Babu film,am trying something radically different! Trying to make it a very unique sounding album.!!Hope U wl all love it.! (sic)", Devisri posted on his micro blogging site.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X