twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారల క్రికెట్ వేడుక, అదరగొట్టిన హీరోయిన్లు(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    విశాఖపట్నం: టీఎస్ఆర్ క్రిసెంట్ క్రికెట్ కప్ కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈనెల 21న వైజాగ్‌లోని క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో అందుకు సంబంధించిన పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేసారు. పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో క్రికెట్ కప్ ను ఆవిష్కరించారు.

    ఈ సందర్భంగా నిర్వాహకులు టి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... నేటి యువతకు క్రీడలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్ అంటే వారి ఆనందానికి హద్దేవుండదు. సినీ తారలతో వైజాగ్ క్రికెట్ స్టేడియంలో రానున్న డిసెంబర్ 21న సిసిసి మ్యాచ్ భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంట్రీ టికెట్‌కు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. 35వేల మందికి ఉచితంగా తారల సందడితో ఈ పోటీ నిర్వహిస్తున్నామని, ఇది వైజాగ్ యువతకు ఉచితంగా ఇస్తున్న కానుక అని టి సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

    స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు...

    టీఎస్ఆర్ క్రిసెంట్ క్రికెట్ కప్

    టీఎస్ఆర్ క్రిసెంట్ క్రికెట్ కప్


    గత రెండేళ్లుగా క్రీసెంట్ క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్న కె.ఎం. డి.ఎస్.షఫీతో ఈసారి సుబ్బిరామిరెడ్డి కలసి ఈ పోటీలను టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్‌తో వైజాగ్‌లో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పరిచయ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది.

    కప్ ఆవిష్కరణ

    కప్ ఆవిష్కరణ


    ఈ సందర్భంగా క్రికెట్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అందించబోయే క్రికెట్ కప్‌ను గంటా శ్రీనివాసరావు ఆవిష్కరించారు.

    ఉద్దేశ్యం మంచిదే

    ఉద్దేశ్యం మంచిదే


    ఓ మంచి కార్యక్రమంకోసం షఫీ ఈ పోటీలను గత రెండేళ్లనుండి నిర్వహిస్తున్నారని, వైజాగ్ యువతకు క్రీడలపై మరింత అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం టిఎస్‌ఆర్ వైజాగ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని, సినీ తారల సందడితో స్టేడియం కలర్‌ఫుల్‌గా ఉండనుందని, అదే విధంగా వైజాగ్‌లో ఉన్న వెయ్యి యువజన సంఘాలకు క్రికెట్ కిట్‌లు అందించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు.

    సేవా మార్గం

    సేవా మార్గం


    ఈ పోటీలతో వచ్చిన లాభాన్ని వంద మంది మహిళలకు కుట్టుమిషన్ల రూపంలో, వృద్ధులకు డబ్బు రూపంలో అందించామని, గత ఏడాది దాదాపు 6800 మంది రక్తదానం చేశారని, ఈ ఏడాది సుబ్బిరామిరెడ్డితో కలసి ఈ పోటీ నిర్వహిస్తున్నందుకు సంతోషంగా వుందని, ట్రస్ట్ చైర్మన్ షఫీ తెలిపారు.

    బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి

    బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి


    ఓ మంచి సేవా కార్యక్రమాలకోసం ఈ ఆటలు ఆడుతున్నామని, ఇది అందరికీ ఆదర్శంగా నిలవాలని, ఈసారి అందమైన వైజాగ్ తీరంలో ఆడుతున్నందుకు ఆనందంగా వుందని బాలీవుడ్ కెప్టెన్ సునీల్‌శెట్టి తెలిపారు.

    శ్రీకాంత్

    శ్రీకాంత్


    పేదలకు, మహిళలకు సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం తాము ఈ పోటీల్లో పాల్గొంటున్నామని, అందరి ప్రోత్సాహం తమకుంటుందని టాలీవుడ్ కెప్టెన్ శ్రీకాంత్ అన్నారు.

    సినీ స్టార్స్

    సినీ స్టార్స్


    ఈ కార్యక్రమంలో కథానాయికలు అక్ష, హంసానందిని, ఛార్మీ, కామ్నాజఠ్మలానీ, మధుశాలిని ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాగార్జున, రానా, తరుణ్, నిఖిల్, మంచు లక్ష్మి, గుత్తా జ్వాల, స్నేహ ఉల్లాల్, సంజన, ఉష, నిఖిత, చాముండేశ్వరినాథ్, అవంతి శ్రీనివాసరావుతదితరులు పాల్గొన్నారు.

    వివాదం

    వివాదం


    కాగా...సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ నెల 24న వైజాగ్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే వన్డే మ్యాచ్ రద్దు చేయాలని కోరుతూ బీసీసీఐకి లేఖ రాసిన రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, 21న జరిగే టీఎస్ఆర్ క్రిసెంట్ కప్ కు మద్దతుగా నిలవడం, నటుడు నాగార్జునతో కలిసి క్రికెట్ ట్రోపీని ఆవిష్కరించడం వివాదాస్పదం అయింది.

    English summary
    Heroines Dance Performances at TSR Crescent Cricket Cup 2013 curtain raiser. Nagarjuna, Tarun, Sneha Ullal, Madhu Shalini, Ipsita Pati, Jwala Gutta, Aksha Pardasany, Hamsa Nandini Attended.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X