రవీంద్రభారతిలో ఏఎన్ఆర్ బర్త్‌డే, చిరు వెండి జ్ఞాపిక
హైదరాబాద్ : టాలీవుడ్ లెజండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఈనెల 20న 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని టి.సుబ్బరామిరెడ్డి లలితకళా పరిషత్తు నిర్ణయించింది. రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి హైదరాబాదులోని రవీంద్రభారతి వేదిక కానుంది.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరవుతారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి చిరంజీవి, 'లోకాయుక్త' జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి, సినారె, రామానాయుడు,ప్రముఖ నటీమణి వైజంతీమాల తదితరులు పాల్గొననున్నారు. అక్కినేని కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలకు హాజరవుతారు. చిరంజీవి ఈ సందర్భంగా అక్కినేనికి 90 వసంతాల గుర్తుగా వెండి జ్ఞాపికను బహూకరిస్తారు.

అక్కినేని పుట్టినరోజు సందర్భంగా 'భాయ్' మూవీ ఆడియో రిలీజ్ చేయాలనే ప్లాన్లో నాగార్జున ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు హాజరయ్యేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
అక్కినేని హీరోలు ముగ్గురూ కలసి నటిస్తున్న చిత్రం 'మనం' చిత్రం ఫస్ట్ లుక్ కూడా ఈ సందర్భంగా విడుదల చేయనున్నారట. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో శ్రియ, సమంత హీరోయిన్స్. విక్రమ్ కుమార్ దర్శకుడు.అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సినిమా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











