పవన్ కళ్యాణ్ అలా, చిరంజీవి ఇలా..... ఈ పెద్దమనిషి మాటలు నమ్మొచ్చా?
'ఇకపై సినిమాల మీద ఆలోచన లేదు, సీరియస్‌గా రాజకీయాల్లోకి దిగా'.... ఇది ఇటీవల పవన్ కళ్యాణ్ తన రాజకీయ యాత్ర ప్రారంభం సందర్భంగా చేసిన కామెంట్స్. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి 'సైరా' షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొత్తం ఆయన దాదాపుగా ఈ సినిమా తప్ప మరో సినిమాలో నటించే అవకాశం లేదు. మెగా అన్నదమ్ములిద్దరూ చెరో దారిలో ప్రయాణిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటించే అవకాశం దాదాపుగా లేదు. అయితే ఓ పెద్ద మనిషి మాత్రం మెగా మల్టీస్టారర్ తీస్తాను అంటూ అభిమానుల్లో ఆశలు రేపుతున్నారు.
Recommended Video


టి. సుబ్బిరామిరెడ్డి ఆసక్తికర ప్రకటన
చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా తీస్తాను అంటూ కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి గతేడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. సరిగా సంవత్సరం తర్వాత ఆయన నుండి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.

స్టోరీ లాక్, స్క్రిప్టు పూర్తయిన వెంటనే షూటింగ్
ఆదివారం వరంగల్ వచ్చిన టి. సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... మెగా మల్టీ స్టారర్ కథ లాక్ చేశామని, స్క్రిప్టు వర్క్ ప్రస్తుతం వేగంగా నడుస్తోంది అని తెలిపారు. త్వరలోనే షూటింగ్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తామని తెలిపారు.

నిజంగా ఆ అవకాశం ఉందా?
అయితే టి సుబ్బిరామిరెడ్డి మాటలు నమ్మలా? వద్దా? తెలియక మెగా అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. 2019 ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ సినిమా వైపు చూసే అవకాశం లేదు. మరి టీఎస్ఆర్ ఏ నమ్మకంతో ఈ కామెంట్స్ చేశారు? అనేది అర్థం కావడం లేదు.

చిరంజీవి వరుస కమిట్మెంట్స్
మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహా రెడ్డి' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది. దీని తర్వాత ఆయన బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

క్లారిటీ ఉంటే బావుంటుంది
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ చాలా క్లోజ్... ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయనకు ఈ ఇద్దరూ కమిట్మెంట్ష్ ఇచ్చిన మాట కూడా నిజమే. ప్రస్తుత పరిస్థితిని గమనించకుండా సుబ్బిరామిరెడ్డి మెగా మల్టీ స్టారర్ గురించి ఇలాంటి ప్రకటనలు చేయడం అభిమానుల్లొ అయోమయానికి కారణం అవుతోంది. మీడియా ఎదురుపడింది కదా అని స్టేట్మెంట్స్ ఇచ్చేయకుండా టీఎస్ఆర్ క్లారిటీ మెయింటేన్ చేస్తే బావుంటుందని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











