ఫంక్షన్ ఫొటోలు: అఖిల్, చరణ్, చిరు, బాలకృష్ణ, తమన్నా వీరంతా...
హైదరాబాద్ :టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న జాతీయ సినీ పురస్కారాల వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.2010లో లలిత కళా పరిషత్ సంస్థను స్థాపించిన టి.సుబ్బిరామిరెడ్డి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9తో కలసి టిఎస్‌ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్‌మ అవార్డులను అందిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
''పురస్కారాలు కళాకారులకు వూపిరిలా, ఉత్సాహంలా పనిచేస్తాయి. మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి కావాల్సినంత ప్రోత్సాహాన్నిస్తాయి. మన చిత్రాలు ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందుతున్నాయి. వాటి వెనక పురస్కారాల ప్రేరణ ఎంతో ఉంటుంది''అన్నారు మెగాస్టార్, ఎంపీ చిరంజీవి.
టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న జాతీయ సినీ పురస్కారాల వేడుక ఆదివారం శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.సినీతారల వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. నృత్యాల హోరులో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.
స్లైడ్ షోలో ఆ ఫొటోలు

చిరంజీవి మాట్లాడుతూ...
''మా బాలయ్య బాబుకి అవార్డు వచ్చినందుకు అభినందిస్తున్నా. ఏ ఒక్కరినో సంతోషపెట్టడానికి పురస్కారాలు ఇవ్వరు. ప్రతిభను, కళల్ని ప్రోత్సహించే లక్ష్యంతోనే పురస్కారాలు అందజేస్తుంటారు'' అన్నారు.

బాహుబలి గురించి
చిరంజీవి కంటిన్యూ చేస్తూ...'బాహుబలి' లాంటి అత్యద్భుతమైన చిత్రాలు మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వస్తుండటం ఆనందంగా ఉంది. '300', 'ట్రాయ్'లాంటి సినిమాలకి దీటుగా 'బాహుబలి'ని తీసి తెలుగువారందరికీ గర్వకారణంలా నిలిచాడు రాజమౌళి'' అని ప్రశంసించారు.

రిషి కపూర్ కి పురస్కారం
మిలీనియం సెన్సేషనల్ స్టార్ పురస్కారాన్ని అందుకొన్నారు రిషి కపూర్

రిషి కపూర్ మాట్లాడుతూ..
మాట్లాడుతూ.. ''ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. భారతీయ చిత్ర పరిశ్రమ అంతటికీ గర్వకారణం 'బాహుబలి'. మనందరినీ కలిపే భాష సినిమా'' అన్నారు.

బాలకృష్ణ కు అవార్డు
'లెజెండ్'కిగానూ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకొన్నారు బాలకృష్ణ.

బాలకృష్ణ మాట్లాడుతూ ...
''కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడానికి స్ఫూర్తి మా నాన్నగారు. ఆయనిచ్చిన ధైర్యంతోనే'ఆదిత్య 369', 'భైరవద్వీపం' లాంటి సినిమాలు చేశాను''అన్నారు.

వెంకటేష్ మాట్లాడుతూ..
'దృశ్యం'కు పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు వెంకటేష్.

మోహన్ బాబు మాట్లాడుతూ...
నేను తీసిన'రౌడీ'కి పురస్కారం దక్కడం సంతోషంగా ఉందన్నారు మోహన్‌బాబు.

శత్రుఘ్న సిన్హా మాట్లాడుతూ....
''ఈ రోజు భారతీయ చలన చిత్ర పరిశ్రమ గర్వంగా తలెత్తుకొంటుందంటే కారణం 'బాహుబలి'. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్' వూపు వూపేస్తోంది. ఆ సినిమా తీసిన కబీర్ ఖాన్, 'బాహుబలి' తీసిన రాజమౌళి జీనియస్‌లు'' అన్నారు.

నాగ చైతన్య మాట్లాడుతూ..
''తాతయ్య చివరి చిత్రానికి పురస్కారం అందుకోవడం గర్వంగా ఉంది. ఆ జ్ఞాపకాలు ఎప్పుడూ మాతోనే ఉంటాయ''న్నారు నాగచైతన్య, అఖిల్.

సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ...
తెలుగు ప్రజల కళాతపస్సుని భారతదేశానికి చాటి చెప్పడమే నా ధ్యేయమన్నారు టి.సుబ్బరామిరెడ్డి.

ఈ పంక్షన్ లో...
జమున, షబానా అజ్మీ, శిల్పా శెట్టి, రవీనా టాండన్, రామ్‌చరణ్, రానా, గోపీచంద్, బోయపాటి శ్రీను, శ్రీను వైట్ల, శ్రీప్రియ, శ్రియ, లక్ష్మీప్రసన్న, గుల్షన్ గ్రోవర్, అద్నాన్ సమీ, మధుర్ బండార్కర్, రమేష్ సిప్పీ, పరుచూరి బ్రదర్స్, రాజశేఖర్, జీవిత, జయసుధ, రకుల్‌ప్రీత్, పింకీ రెడ్డి, శోభన కామినేని తదితరులు పాల్గొన్నారు.

చిరు, బాలయ్య మధ్యలో
ఇద్దరు హీరోల మధ్యన హీరోయిన్ ఇలా..

తాప్సీ, బాలకృష్ణ, చిరంజీవి
హీరోయిన్ తాప్సీ, బాలకృష్ణ, చిరంజీవి ఒకే స్టేజిపై కనివిందు చేసారు.

తమన్నా, తాప్సీ, మద్యలో ఛార్మీ
హీరోయిన్స్ మధ్యలో ఉన్న ఈయన ఎవరో గుర్తు వచ్చారా..

కన్నుల పండుగే
మధ్యలో మోహన్ బాబు ని పెట్టి ఈ సీనియర్స్ అంతా కలిసి...

తమన్నా చేతుల మీదుగా
తమన్నా ,అటు జయసుధ,ఇటు జీవిత అందరూ ఇదిగో..ఇలా

జమనను సత్కరిస్తూ...
సినీ కులం వారంతా జమునను సత్కరించటంలో బిజీ అయ్యారు

ఆ తరం ..ఈ తరం
రెండు జనరేషన్ హీరోయిన్స్ అంతా ఇదిగో వరసగా కూర్చుని

గుల్షన్ గ్రోవర్ ఏం చూపిస్తున్నారు
గుల్షన్ గ్రోవర్ తన సెల్ లో ఏం చూపెడుతున్నాడంటారు

తమన్నా హోయలు
ఈ పంక్షన్ లో తమన్నా హోయిలు స్పెషల్ ఎట్రాక్షన్

బాలయ్య చేతుల మీదుగా రామ్ చరణ్
బాలయ్య చేతుల మీదుగా రామ్ చరణ్ అవార్డు అందుకుంటూ ..ప్రక్కనే తండ్రి తో కలిసి

ఉల్లాసంగా నృత్యాలతో
పంక్షన్ ప్రారంభానికి ముందు ఉల్లాసంగా నృత్యాలతో గడిచింది

ఛార్మి హైలెట్
ఛార్మీ చేసిన డాన్స్ లు హైలెట్ గా నిలిచాయి

ముచ్చట్లు
సీనియర్స్ ఇలా కలవక కలవక కలిసి ముచ్చట్లు పెట్టారు

సలహానా
పరుచూరి వెంకటేశ్వరారు గారు నిర్మాత బండ్ల గణేష్ కు చెప్తున్నది సలహానా ..ఏమో

రామ్ చరణ్ అదుర్స్
రామ్ చరణ్ రఫ్ గా గెడ్డంతో గ్యాంగ్ లీడర్ నాటి చిరంజీవి ని గుర్తు చేసారు

తన హీరోయిన్ తో
తన హీరోయిన్ రవీనా టండన్ తో మోహన్ బాబు ఇదిగో ఇలా ముచ్చటపడ్డారు

మంచు లక్ష్మి
ఈ పంక్షన్ లో మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు

మీనా
అవును మీరు చూస్తున్నది మీనానే..చాలా బొద్దుగా మారింది కదూ

ఇద్దరూ ఇద్దరే
ఒకరితో ఒకరు పోటీపడుతూ సినిమాలు చేసిన ఉద్దండులు ఇద్దరూ ఇదిగో ఇలా..

రామ్ చరణ్ తో ముచ్చట్లు
రామ్ చరణ్ తో ముచ్చట్లు పెట్టుకుంది ఎవరో ఎరుకనా

ఆలోచనలో
రామ్ చరణ్ ...ఈ పంక్షన్ లోనూ ఏదో ఆలోచనలో పడ్డట్లున్నారు. చేస్తున్న సినిమా గురించా

రానా
బాహుబలి ఉత్సాహం రానా లో కనపడుతోంది. మీరు సరిగ్గా గమనిస్తే...

అఖిల్ కూడా
అఖిల్ కూడా ఇదిగో ఇలా ఈ ఫంక్షన్ లో మెరిసాడు

నాగచైతన్య,రానా
బంధువులైన నాగచైతన్య, రానా ఇద్దరు మంచి స్నేహితులు కూడా

శ్రేయ ఏం చెప్తోంది
శిల్పా శెట్టి ఎటో చూస్తోంది. శ్రేయ ఏమో ముచ్చట్లు పెట్టింది

జీవిత,మీనా
ఇద్దరూ దాదాపు తప్పుకున్న హీరోయిన్సే మరి.

దీక్షగా
మోహన్ బాబు తన కుమార్తె తో వచ్చాడు. దీక్షగా పంక్షన్ ని తిలకిస్తున్నారు

తమన్నా, జయప్రదతో కలిసి
తమన్నా, సీనియర్ నటి జయప్రదతో కలిసి కూర్చున్నారు.

రాజశేఖర్ ఏం చెప్తున్నారు
సీనియర్ హీరో రిషి కపూర్ కు రాజశేఖర్ ఏం చెప్తున్నారంటారు

ప్రభు,తమన్నా మధ్యలో ఎవరు
ఇదిగో ఈ స్టేజిపై వీరిద్దరి మధ్యలో ఉన్నది ఎవరంటారు

ముగ్గరు సీనియర్లు
బాలయ్య, చిరంజీవి మధ్యలో రిషికపూర్ ఇదిగో ఇలా

షేక్ హ్యాండ్ ఇస్తూ
బాలయ్యకు షేక్ హ్యాండ్ ఇస్తూ చిరంజీవి ..మద్యలో రిషి కపూర్ ని పలకరిస్తూ

క్లోజ్ ఫ్రెండ్స్
తాప్సీని ఇంట్రడ్యూస్ చేసిన లక్ష్మి మంచు తో కలిసి

మధ్యలో రావు రమేష్
అటు జమున,ఇటు మీనా మధ్యలో రావు రమేష్ కూర్చున్నారు.

గోపీచంద్ కూడా
ఈ పంక్షన్ కు గోపీచంద్ కూడా వచ్చాడండోయ్

రాజశేఖర్ తీక్షణంగా చూస్తూ
పంక్షన్ లో రాజశేఖర్ తీక్షణంగా చూస్తూ కూర్చున్నారు

శతృఘ్న సిన్హా
శతృఘ్న సిన్హా..పురస్కారం అందుకుంటూ..ఇదిలో టాలీవుడ్ సీనియర్స్ తో కిలిసి

తమన్నా,తాప్సీ
ఈ పంక్షన్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన తమన్నా,తాప్సీ ఇదిగో ఇలా మెరుస్తూ...


Click it and Unblock the Notifications











