twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    “బాహుబలి” పని పూర్తి చేసిన TTD విద్వాంసులు

    By Srikanya
    |

    హైదరాబాద్ : రాజమౌళి గారి సోదరుడు ఎమ్.ఎమ్ కీరవాణి... తన తాజా చిత్రం "బాహుబలి" బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , రీరికార్డింగ్ పని పూర్తి చేసే బిజీలో ఉన్నారు. తాజాగా ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి అయ్యింది. అయితే ఇక్కడో విశేషం ఉంది.

    అది మరేదో కాదు...టీటీడి దేవస్దానం కు చెందిన ..నాదస్వరం విద్వాంసులతో పూర్తి చేసారు. వారిని పిలిపించి వారితో నాద స్వరం చేయించారు. దాంతో డాల్భీ అట్మాస్ లో రీరికార్డింగ్ పూర్తి చేసినట్లు అయ్యింది. అందుకు సంభందించిన ఫొటోని కీరవాణి గారు తన సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో పోస్ట్ చేసారు. మీరు ఇక్కడ చూడవచ్చు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    రోజులు గడుస్తున్న కొద్దీ రాజమౌళి కలల వెంచర్ ‘బాహుబలి' పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సౌండ్ ఇంజనీరింగ్ లో జాతీయ అవార్డు గ్రహిత పి.ఏం సతీష్ సారధ్యంలో డాల్బీ అట్మాస్ సౌండ్ పరిజ్ఞానంలో విడుదలకానుంది.

    TTD musicians completed Baahubali work

    ఈ డాల్బీ అట్మాస్ పరిజ్ఞానంద్వారా 3D సౌండ్ అనుభూతికలుగుతుంది. రియాలిటీకి దగ్గరగా వున్న ఈ పరిజ్ఞానాన్ని ఇదివరకు విశ్వరూపం సినిమాకు ఉపయోగించారు. ఇటువంటి ప్రయోగం చేయడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం

    ‘బాహుబలి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం కోసం ఇద్దరు అన్నాదమ్ముల మధ్య జరిగే పోరాటమే బాహుబలి' . ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులు. రానా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు.

    పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్ కి వెళ్లనుంది. ఆర్కా మీడియా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

    English summary
    Leading musicians who play Naada Swaram in Tirumala Lord Balaji temple are called by Rajamouli and his brother Keeravani to finish “Baahubali: The Beginning” work of background score with this Nada Swaram.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X