twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వేణుకు తెలంగాణ ఫోరం మద్దతు, గౌడ సంఘాల ధర్నా

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నటుడు వేణును అరెస్టు చేయాలంటూ గౌడసంఘాల నాయకులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఈనెల 18న ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమంలో కల్లువృత్తిని, గౌడ మహిళలను అవమానించే విధంగా స్క్రిఫ్ట్‌ను ప్రదర్శించారని గౌడ సంఘాల నేతలు ఆరోపించారు.

    వారి ఆందోళన అలా ఉంటే....వేణుపై గౌడ కమ్యూనిటీకి చెందిన వారు చేసిన దాడిని తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం(టిటిడిఎఫ్) ఖండించింది. ఈ మేరకు టిటిడిఎఫ్ అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.

    TTDF supports 'Jabardasth' Venu

    ‘గత సాయంత్రం(21వ తేదీ) ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్ లో బుల్లితెర కళాకారుడు తెలంగాణ కళామతల్లి ముద్దు బిడ్డ వేణుపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ లోని సన్నివేశం కొంతమంది మనోభావాలు నొప్పించినందువల్ల ఈ దాడి జరిగిందని అంటున్నారు. మనో భావాలు దెబ్బతిన్నపుడు దాన్ని ఖండించడానికి ప్రజాస్వామ్యబద్దంగా తెలియజేయడానికి భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అనేక వేదికలు కల్పించింది. ఈ రకంగా భౌతికంగా కళాకారునిపై దాడి చేయడం మంచి పద్దతి కాదు. జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కారకులైనవారిపై తగిన చర్యలు తీసుకోవాలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని నాగబాల సురేష్ కుమార్ డిమాండ్ చేసారు.

    English summary
    'Jabardasth' comedian Venu was manhandled by the members of Goud community on Sunday morning near Film Nagar temple. A case was registered against the people who attacked Venu. Speaking about this incident, Nagabala Suresh Kumar(TTDF President) condemned the act done by the Goud community.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X