»   » క్రికెటర్ సురేష్ రైనా పాడిన పాట ఇదే (వీడియో)

క్రికెటర్ సురేష్ రైనా పాడిన పాట ఇదే (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండియన్ క్రికెటర్ సురేష్ రైనా ‘మీరుథియా గ్యాంగ్‌స్టర్స్' చిత్రం కోసం తూ మిల్ సబ్ మిల్తా అనే పాట పాడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పాడిన పాటకు సంబంధించిన వీడియో రిలీజైంది. రైనా వాయిస్ చాలా బావుందని, సాంగ్ కంపోజింగ్ కూడా బావుందని ఇటు సినీ అభిమానులు, అటు క్రికెట్ అభిమానులు అంటున్నారు.

జిషన్ కాద్రి దర్శకత్వంలో క్రైమ్ కామెడి ఎంటర్ టైనర్‌గా ‘మీరుథియా గ్యాంగ్‌స్టర్స్' చిత్రం రానుంది. క్రికెట్‌ మధ్యలో సంగీతమే తనకు తోడుగా నిలుస్తుందని, పాటలు వింటూ వింటూ పాడటం కూడా అలవాటైపోయిందని చెప్పాడు. ‘మీరుథియా గ్యాంగ్‌స్టర్స్' సినిమా నిర్మాత షోయబ్‌ అహ్మద్‌ తమ కుటుంబానికి సన్నిహితుడని చెప్పాడు.

 Tu Mili Sab Mila - Meeruthiya Gangsters

అతను కొన్నాళ్ల క్రితం ఈ సినిమాలో ఓ పాట పాడమని అడిగాడని, తన భార్య ప్రియాంక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించిందన్నాడు. ఈ పాటను ఆస్వాదిస్తూ పాడానని చెప్పాడు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు. ‘మేరుథియా గ్యాంగ్‌స్టర్స్' చిత్రం సెప్టెంబర్ 18వ తేదీన విడుదల కానుంది.

English summary
Presenting the official videos of Tu Mili Sab Mila sung by Suresh Raina from Meeruthiya Gangsters.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu