twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ మొహం ఎందుకు చూపించలేదు? దలైలామా అంశం వల్ల కూడా సమస్యలా..!??

    |

    బాలీవుడ్ కండల వీరుడు నటిస్తున్న తాజా చిత్రం 'ట్యూబ్ లైట్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మధ్య సల్మాన్ సినిమాలన్నీ వరుసబెట్టి ఘనవిజయాలు సాధిస్తుండడం.. భారీ కలెక్షన్లు సాధిస్తుండడంతో ఇప్పుడు రాబోయే ఈ సినిమా మీద కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ ను నిన్న విడుదల చేశారు.

    దర్శకుడు కబీర్ ఖాన్ అభిమానులకు విషెస్ చెబుతూ ఇన్ స్టా గ్రామ్ ద్వారా ఈ లుక్ ను విడుదల చేశారు. సల్మాన్ సైనికుడి యూనిఫాంలో కనిపిస్తున్నారు. కానీ ఈ చిత్రంలో సల్మాన్ ముఖాన్ని మాత్రం చూపించలేదు. దీన్ని బట్టి బట్టి సల్మాన్ ఈసారి ప్రత్యేక అవసరాలున్న మనిషిగా కనిపిస్తాడనే ప్రచారానికి బలం చేకూరినట్టైంది...ఇలా ఆగస్ట్ 15నే ట్యూబ్ లైట్ ఫస్ట్ లుక్ ఇవ్వడానికి కారణం.. అది దేశభక్తి కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండడమే. 1962లో జరిగిన ఇండో-చైనీస్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఇందులో స్పెషల్ నీడ్స్ అవసరమైన ఓ వ్యక్తిగా సల్మాన్ కనిపించనుండగా.. ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలానే ఉంది. అందులో అటు తిరిగి నడుస్తున్న ఓ సైనికుడు కనిపిస్తాడు.
    అసలు ఈ సినిమాలో సల్మాన్ ఎలా కనిపిస్తాడు... ఎందుకని సల్మాన్ మొహం చూపించకుండా పోస్టర్ వచ్చిందీ అన్న విశయాలపై స్లైడ్ షో లో....

    వరుసగా విజయాలు

    వరుసగా విజయాలు

    భజరంగీ భాయి జాన్, సుల్తాన్ వరుసగా రెండూ సల్మాన్ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ చరిత్రలోనూ ముఖ్యమైన సినిమాలు... ఇప్పుడు వీటి తర్వాత వస్తూన్న "ట్యూబ్ లైట్" మీద కూడా అంతే స్థాయి అంచనాలున్నాయి.

    ఇండో - చైనీస్ యుద్ధం

    ఇండో - చైనీస్ యుద్ధం

    1962 లో జరిగిన ఇండో - చైనీస్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా మొదటి భాగం లడఖ్ లో పూర్తి చేశారు.

    సొహైల్ ఖాన్

    సొహైల్ ఖాన్

    ఈ సినిమాలో సల్మాన్ సోదరుడు సొహైల్ ఖాన్ రీల్ లైఫ్ సోదరుడిగాకనిపించనున్నాడు. సల్మాన్ కు ఉన్న సెంటిమెంటన్ ను ఫాలో అవుతూ ఈ చిత్రాన్ని కూడా రంజాన్ పర్వదినాన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ భావిస్తోందంట.

    స్పెషల్ నీడ్స్ అవసరమైన ఓ వ్యక్తి:

    స్పెషల్ నీడ్స్ అవసరమైన ఓ వ్యక్తి:

    ఇందులో స్పెషల్ నీడ్స్ అవసరమైన ఓ వ్యక్తిగా సల్మాన్ కనిపించనుండగా.. ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకునేలానే ఉంది. అందులో అటు తిరిగి నడుస్తున్న ఓ సైనికుడు కనిపిస్తాడు.

    అటు తిరిగి నడుస్తున్న ఓ సైనికుడు

    అటు తిరిగి నడుస్తున్న ఓ సైనికుడు

    అయితే ఆ "స్పెషల్" విషయాన్నే ఇప్పుడు దాస్తున్నట్టు ఉంది. సల్మాన్ మొహం లోనే ఆ భాద తాలూకు చిహ్నాలని చూపించనున్నారేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

    సోల్జర్ లా సల్మాన్

    సోల్జర్ లా సల్మాన్

    భుజానికి తుపాకి తగిలించుకోని యుద్ధ క్షేత్రంలోకి నడుస్తున్న సోల్జర్ లా సల్మాన్ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో సల్మాన్ పూర్తి స్థాయి సైనికుడిగా నటిస్తున్నాడా.. లేక ఏదైన కీలక సన్నివేశం కోసం ఈ లుక్ లో కనిపిస్తున్నాడా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు...

    కానీ..

    కానీ..

    అక్కడ ఉన్నది సల్మాన్ అని గుర్తు పట్టేందుకు ఆడియన్స్ కి పెద్దగా టైమ్ అవసరం లేదు కానీ.. సల్మాన్ ఫేస్ ని చూపించకుండానే ఫస్ట్ లుక్ అనడంతోనే అందరికీ ఆశ్చర్యం వేసింది. ట్యూబ్ లైట్ లో సల్మాన్ లుక్ వెనక సీక్రెట్ ఉందని.. ఇప్పటికే గుసగుసలు మొదలైపోయాయి.

    చైనా భామ చూచూ హీరోయిన్ గా

    చైనా భామ చూచూ హీరోయిన్ గా

    ఈ మూవీలో చైనా భామ చూచూ హీరోయిన్ గా నటిస్తుండడం ఓ విశేషం... మొన్నటికి మొన్న ఇండో పాక్ అంసాన్ని కదిపిన సినిమా చేసిన సల్మాన్ రెండు దేశాల పౌరులనీ కదిలించాడు. ఇప్పుడు చైనా తోనూ "హిందీ-చీనీ భాయీ భాయీ" అనిపిస్తాడేమో చూడాలి..

    ల‌ఢఖ్‌లోనే

    ల‌ఢఖ్‌లోనే

    నెల రోజులుగా ట్యూబ్‌లైట్ షూటింగ్ కోసం ల‌ఢఖ్‌లోనే ఉన్నాడు స‌ల్మాన్‌ఖాన్‌.. త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్‌తో క‌లిసి ద‌లైలామాతో కాసేపు మాట్లాడాడు. త‌న‌తో స‌ల్మాన్ దిగిన‌ ఫోటోను ద‌లైలామా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

    దలై లామా

    దలై లామా

    దలై లామా అంశాన్ని కూడా సినిమాలో చేర్చ బోతున్నారా అనే ఊహా గానాలూ వస్తున్నాయి. అయితే ఇప్పటికే దలైలామా విషయం లో కోపంగా ఉన్న చైనాకి మరింత ఆజ్యం పోస్తుందేమో అన్న అనుమానమూ లేకపోలేదు. అయితే అదంత పట్టించుకోదగ్గ విషయమేం కాదు.

    ఏక్తా టైగర్

    ఏక్తా టైగర్

    ఏక్తా టైగర్, భజరంగీ భాయిజాన్ లాంటి సూపర్ హిట్ సినిమాలని ఇచ్చిన కబీర్ ఖాన్ ఈ సినిమా దర్షకుడు కావటం, సల్మాన్ విపరీతమైన ఫాం లో ఉండటం "ట్యూబ్ లైట్" ని బ్రైట్ గానే వెలిగించేలా ఉన్నాయి...

    English summary
    Bollywood Upcoming Film Of Salman Khan “Tubelight” Movie First Look Poster Revealed by Director Kabir Khan shared the the picture on Instagram that shows Salman as soldier.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X