కంటితడి పెట్టిస్తున్న సల్మాన్ ఖాన్.. ఇక నట విశ్వరూపమే..
భారత, చైనా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కిన ట్యూబ్‌లైట్ చిత్రం జూన్ 23వ తేదీన రిలీజ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన పాట ఒకటి గుండెను పిండేసే విధంగా ఉంది
భారత, చైనా యుద్ధ నేపథ్యంగా తెరకెక్కిన ట్యూబ్‌లైట్ చిత్రం జూన్ 23వ తేదీన రిలీజ్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన పాట ఒకటి గుండెను పిండేసే విధంగా ఉంది. ఈ పాటలో సల్మాన్ అభినయం చూస్తే కంటనీరు రాకతప్పదు. మనసు ఉద్వేగానికి గురికాకమానదు. అంతటి అద్భుతమైన నటనను ప్రదర్శించిన సల్మాన్‌పై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ పాటకు యూట్యూట్‌లో విశేష స్పందన లభిస్తున్నది.

హృదయానికి హత్తుకునేలా
ట్యూబ్ లైట్‌లోని టింకా టింకా దిల్ మేరా అనే పాటను సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్ శుక్రవారం విడుదల చేసింది. ఈ పాటలో తన సోదరుడు సోహైల్ ఖాన్, సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సన్నివేశాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. సైన్యంలోకి సోహైల్ ఖాన్ వెళ్తున్న దృశ్యాలు, రణభూమిలో జరిగే పోరాటాలు మనసును తాకేలా ఉన్నాయి.

మానసిక పరిపక్వత చెందని..
ట్యూబ్‌లైట్ చిత్రంలో సల్మాన్ మానసిక పరిపక్వత చెందని యువకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ పాత్ర పేరు లక్ష్మణ్. సైనికుడైన సోదరుడు సోహైల్ ఖాన్ యుద్ధంలో మరణించే
సన్నివేశాలు, ఆ తర్వాత సల్మాన్ పడే బాధ ఇతర సన్నివేశాలు అద్బుతంగా పండాయి అని బాలీవుడ్‌లో చర్చ జరుగుతున్నది.

లిటిల్ బాయ్
హలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన లిటిల్ బాయ్ అనే చిత్రం ట్యూబ్‌లైట్‌కు ఆధారం అనే వార్త ప్రచారంలో ఉంది. బాలీవుడ్‌కు తగినట్టుగా ఈ చిత్రానికి తగుమార్పులు చేసి భారత, చైనా యుద్ధ కథను బ్యాక్‌డ్రాప్ మార్చారు.

సైన్యంలో చేరే సోదరుడితో
సైన్యంలో చేరేందుకు వెళ్తున్న తన సోదరుడిని చూసి సల్మాన్ కంటతడి పెట్టే సన్నివేశం అద్భుతంగా చిత్రీకరించారు. ఈ పాటను రహత్ ఫతే అలీ ఖాన్ పాడారు. ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రంలో జగ్ ఘూమేయా, దంబాగ్‌లో తేరే మస్త్ మస్త్ దో నయీ అనే పాటను ఆయన పాడిన సంగతి తెలిసిందే.

సల్మాన్ నటవిశ్వరూపమేనట.
ట్యూబ్‌లైట్ చిత్రంలో నటనపరంగా సల్మాన్ ఖాన్ విశ్వరూపం చూపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఏడాదికి సల్మాన్ ఖాన్ జాతీయ ఉత్తమ నటుడు అనే వార్త ప్రచారంలో ఉంది. విడుదలకు ముందే
సల్మాన్ నటనకు ఇలా ప్రచారం జరుగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్‌లో స్టార్‌నే చూసిన ప్రేక్షకుడు.. ఈ చిత్రంలో ఆయనను గొప్ప నటుడిని చూడటం జరుగుతుందని బల్లగుద్ది చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











