twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్’ టీజర్.. సూపర్బ్!

    సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ట్యూబ్ లైట్'. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వీడియో టీజర్ రిలీజైంది.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సల్మాన్ ఖాన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ట్యూబ్ లైట్'. హిస్టారికల్ వార్ నేపథ్యంలో సాగే ఈ సినిమా 1962 లో జరిగిన చైనా ఇండియా వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ చైనా అమ్మాయి ప్రేమలో పడే యువకుడిగా నటిస్తున్నాడు.

    తాజాగా ఈ చిత్రానికి సంబంధించి వీడియో టీజర్ రిలీజైంది. టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. హై ఎండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన చైనా హీరోయిన్ జూజూ నటిస్తుంది.

    భారత్‌కు చెందిన ఓ యువకుడు, చైనాకు చెందిన యువతి ప్రేమలో పడుతారు. భారత, చైనా యుద్దంలో వారు ఎలాంటి పరిస్థుతులను ఎదుర్కొన్నారనే కథ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ అతిథి పాత్రను పోషిస్తున్నట్టు డైరెక్టర్ కబీర్ ఖాన్ వెల్లడించారు.

    ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించారు. 2017 ఈద్ సందర్భంగా మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అంటే జూన్ 23న లేదా 22న సినిమా విడుదలయ్యే అవకావం ఉంది.

    English summary
    Produced by Salman Khan Films, starring Salman Khan and Sohail Khan, Tubelight is directed by Kabir Khan. The film will release in theaters on June 23rd, 2017.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X