Love Story Effect: థియేటర్లలో నాని సినిమాలు బ్యాన్, నేచురల్ స్టార్ పిరికివాడిలా.. ఎగ్జిబిటర్ల ఫైర్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో టక్ జగదీష్ రిలీజ్ వ్యవహారం వివాదంగా మారింది. ముందుస్తుగా లవ్ స్టోరీ నిర్మాతలు రిలీజ్ డేట్ ఫ్రకటించిన తర్వాత కూడా టక్ జగదీష్‌ మూవీని అదే రోజు రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత సునీల్ నారంగ్‌తో పలువురు డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు నాని, టక్ జగదీష్ నిర్మాతలను తప్పుపట్టారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్గిబ్యూటర్లు మాట్లాడుతూ..

Recommended Video

Tollywood : Vakeel Saab, Love Story మూవీస్ పైనే అందరి ఫోకస్ !

కొద్ది రోజులుగా టక్ జగదీష్ నిర్మాతలతో సినిమా బిజినెస్ అమెజాన్‌ ప్రైమ్ వీడియో నిర్వాహకులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. వారి బిజినెస్ టాక్స్‌లో భాగంగా అమెజాన్ చెప్పిన అమౌంట్‌కు 4 కోట్ల రూపాయల ఎక్కువగా డిమాండ్ చేస్తే ఆ విషయంలో వారి మధ్య చర్చలు జరిపారు. ఆ సమయంలోనే నాని ఓ సినిమా ఫంక్షన్‌కు వచ్చి థియేటర్‌లోనే వస్తామని బహిరంగంగా కామెంట్ చేస్తే.. మరుసటి రోజే అమెజాన్ వాళ్లు దిగివచ్చి ఆ 4 కోట్ల రూపాయలు కూడా ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. థియేటర్ల పేరు చెప్పి నాని నాలుగు కోట్ల రూపాయలు సంపాదించుకొన్నారు. కానీ వచ్చేసారి ఇదే నాని గారికి న్యాయం ఏంటో థియేటర్ ఓనర్లం దేశవ్యాప్తంగా తడాఖా చూపెడుతాం అని ఎగ్జిబిటర్ శ్రీహరి ఘాటుగా స్పందించారు.

ఓటీటీలో రిలీజ్ చేయవద్దు..

ఓటీటీలో రిలీజ్ చేయవద్దు..

డిస్టిబ్యూటర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఓటీటీ విషయం మీద చర్చించేందుకు ఇది రెండోసారి సమావేశం పెట్టుకొన్నారు. ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతూ.. సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయవద్దు. అక్టోబర్ వరకు ఆగండి. థియేటర్లకు మంచి జరుగుతుందని చాలా నిజాయితీగా రిక్వెస్ట్ చేశారు. అయితే మూడు నెలలు కూడా ఆగకుండా కొందరు ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేశారు అని ఎగ్జిబిటర్ శ్రీహరి సీరియస్ అయ్యారు.

సునీల్ నారంగ్ సెల్యూట్

సునీల్ నారంగ్ సెల్యూట్

కొందరు నిర్మాతలు ఇలా వ్యవహరిస్తుంటే. రెండో కరోనావేవ్ ఇంకా తగ్గని సమయంలో, మూడో వేవ్ వస్తుందనే టైమ్‌లో లవ్ స్టోరి సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయాలని ధైర్యంగా ముందుకొచ్చారు. అందుకు మా డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లందరం నిర్మాత సునీల్ నారంగ్‌కు సెల్యూట్ చేస్తున్నాం అని ఆయన అన్నారు.

ఓటీటీలో రిలీజ్ చేసి తలబాదుకొన్నా..

ఓటీటీలో రిలీజ్ చేసి తలబాదుకొన్నా..

ఇక టక్ జగదీష్‌ను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్న నానిపై డిస్టిబ్యూటర్ల తరఫున శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఫంక్షన్‌లో నాని మాట్లాడుతూ.. సినిమా మన సంస్కృతిలో భాగం. థియేటర్లలోనే సినిమా చూడాలి. సినిమా లేకుండా మన జీవితంలో ఏముంటుంది? సినిమాలు థియేటర్లలోనే రిలీజ్ కావాలి. ఇంతకు ముందు నా సినిమాను V ఓటీటీలో రిలీజ్ చేసి తలబాదుకొన్నాను అని చెప్పాడు. నాని పాపులర్ యాక్టర్. కానీ అందరు సినిమా హీరోల మాదిరిగానే ఆయన కూడా మాట్లాడారు. ఓన్లీ ఆయన సినిమాల్లోనే హీరో. నాని పిరికివాడిలా పారిపోయాడు. అలా మాట్లాడిన వ్యక్తి సెప్టెంబర్ 10న టక్ జగదీష్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాడు. ఎగ్జిబిటర్ల జీవితంపై దెబ్బ కొట్టే విధంగా లవ్ స్టోరీ సినిమాపై టక్ జగదీష్ రిలీజ్ చేసి తప్పు చేశారు అని ఎగ్జిబిటర్ శ్రీహరి అన్నారు.

నాని... బుద్ది, జ్ఞానం తెచ్చుకో

నాని... బుద్ది, జ్ఞానం తెచ్చుకో

ఇప్పటికైనా నానికి ఓ రిక్వెస్ట్. ఆయన వెళ్లి నిర్మాతలను కలిసి టక్ జగదీష్ సినిమా రిలీజ్ ‌ను ఆపేలా మాట్లాడండి. ఆ సినిమాను ఆపితే డిస్టిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు మేలు చేసిన వాడిలా అవుతారు. తప్పనిసరిగా చేయాలని, చేస్తారని.. సెప్టెంబర్ 10 తేదీన కేవలం లవ్ స్టోరీ మాత్రమే రిలీజ్ అవుతుందని భావిస్తున్నాం. ఇకనైనా బుద్ది, జ్ఞానం తెచ్చుకొని టక్ జగదీష్‌ రిలీజ్‌ను ఓటీటీలో ఆపేస్తారని అనుకొంటున్నాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాని సినిమాలను బ్యాన్ చేయాలి...

నాని సినిమాలను బ్యాన్ చేయాలి...

సాధారణంగా దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ థియేటర్లకు వ్యతిరేకంగా ఎవరైనా సినిమాలను రిలీజ్ చేస్తే వాళ్లు లైఫ్ టైమ్ బ్యాన్ చేస్తారు. ఇక్కడ కూడా థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తే నానిపై కూడా జీవితకాలం నిషేధం విధించాలని ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు సునీల్ నారంగ్‌ను డిమాండ్ చేస్తున్నామని శ్రీహరి అంటే.. మిగితా ఎగ్జిబిటర్లందరూ మద్దతు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X