Love Story Vs Tuck Jagadish..చంపేయాలని చూస్తున్నారా? టక్ జగదీష్ రిలీజ్ ఆపకపోతే.. నిర్మాత సునీల్ వార్నింగ్

కరోనావైరస్ కారణంగా థియేటర్లు వెలవెల బోతున్న సమయంలో లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం జరుగుతున్నది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య నటించిన లవ్ స్టోరి చిత్రం సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాత సునీల్ నారంగ్ నిర్ణయం తీసుకొన్నారు. అదే రోజున హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకోవడం వివాదంగా మారింది. ఆ వివాదంలోకి నేపథ్యంలో నానిని, ఆ సినిమా నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ..

రోడ్డుపైకి సినిమా థియేటర్ల కార్మికులు

రోడ్డుపైకి సినిమా థియేటర్ల కార్మికులు

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్టీ రామారావు, నాగేశ్వర్ రావు ప్రస్తుతం లేకపోవచ్చు కానీ.. వాళ్ల సినిమాలు రిలీజైన థియేటర్లు ఇంకా ఉన్నాయి. సినిమాలు పుట్టినప్పటి నుంచి థియేటర్ ఓనర్లు, డిస్టిబ్యూటర్లు కలిసి మెలిసి వెళ్తున్నాం. కానీ అనుకోకుండా ఈ వ్యాపారంలోకి ఓటీటీ వచ్చింది. గతంలో టెలివిజన్‌లో సీరియల్స్ వచ్చాయి.

అప్పుడు థియేటర్లకు వచ్చే జనం తగ్గుతారని అనుకొన్నాం. కానీ ఏ మాత్రం తగ్గలేదు.
థియేటర్లకు వచ్చే కలెక్షన్లు తగ్గలేదు. జనాభా పెరుగుతున్న కొద్ది కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఓటీటీ వల్ల సినిమా పరిశ్రమకు నష్టమే. ఓటీటీలో సినిమాలు ప్రదర్శించడం వల్ల క్యాంటీన్లు, సైకిల్ స్టాండ్స్, పోస్టర్ ప్రింటింగ్ లాంటి కార్మికులు రోడ్డున పడుతారు. ఓటీటీలో సినిమా చూస్తే థ్రిల్ రాదు అని నిర్మాత, డిస్టిబ్యూటర్ చదలవాడ స్పష్టం చేశారు.

టక్ జగదీష్ నిర్మాతలకు న్యాయం కాదు..

టక్ జగదీష్ నిర్మాతలకు న్యాయం కాదు..

ఇక లవ్ స్టోరీ సినిమాను ఏషియన్ నిర్మాతలు, శేఖర్ కమ్ముల మొదలు పెట్టినప్పటి నుంచి కరోనా వెంటాడుతున్నది. అయితే ఎన్నో ప్రయాల కోర్చి సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నప్పుడు అదే రోజు ఓటీటీలో టక్ జగదీష్ సినిమాను రిలీజ్ చేయడం ధర్మం కాదు. సెప్టెంబర్ 10వ తేదీన రిలీజ్ చేయడం సమంజసం కాదు అని చదలవాడ తెలిపారు.

మా రిలీజ్ రోజే టక్ జగదీష్ విడుదల సరికాదు

మా రిలీజ్ రోజే టక్ జగదీష్ విడుదల సరికాదు

పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయకూడదని గత మూడు నెలల క్రితం ఇక్కడే మీటింగ్ పెట్టి చెప్పాం. అయినా టక్ జగదీష్ నిర్మాతలు మా లవ్ స్టోరి రిలీజ్ రోజే సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే టక్ జగదీష్ నిర్మాతలతో ఈ విషయం గురించి మాట్లాడాను.

అయితే ఆయన ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పారు. అయితే మేము లవ్ స్టోరి సినిమా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత టక్ జగదీష్‌ను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇది సరికాదు అని లవ్ స్టోరి నిర్మాత సునీల్ నారంగ్ ఘాటుగా అన్నారు.

నాలుగైదు రోజులు ఆపమని రిక్వెస్ట్

నాలుగైదు రోజులు ఆపమని రిక్వెస్ట్

లవ్ స్టోరి సినిమాకు పోటీగా టక్ జగదీష్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ఏమీ కాదు. రేపటి రోజున ఇదే పరిస్థితి ఎదురు కావొచ్చు. పుష్ఫ, ఆచార్య లాంటి సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. అదే సమయంలో మరో సినిమాను ఓటీటీలో మరో నిర్మాత రిలీజ్ చేస్తే పరిస్థితి బాగుండదు. దాని వల్ల మరో నిర్మాతనే నష్టపోతుంటారు. కాబట్టి లవ్ స్టోరి సినిమాను ముందుగా రిలీజ్ డేట్‌ను మేమే అనౌన్స్ చేశాం. కాబట్టి నాలుగైదు రోజులు లేటుగా రిలీజ్ చేయమని చెప్పాం అని సునీల్ నారంగ్ అన్నారు.

భవిష్యత్‌లో ఏం చేయాలో డిసైడ్ అవుతాం

భవిష్యత్‌లో ఏం చేయాలో డిసైడ్ అవుతాం

థియేటర్లలో పెద్ద హీరో సినిమా రిలీజ్ చేసిన సమయంలో ఓటీటీలో మరో సినిమాను రిలీజ్ చేస్తే ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది. అలా చేయడం వల్ల ఎగ్జిబిటర్లు డిస్టిబ్యూటర్లకు డబ్బు కట్టరు. డిస్టిబ్యూటర్లు నిర్మాతలకు డబ్బు కట్టరు. చివరకు నిర్మాత నష్టం జరుగుతుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తే ఏమీ కాదు. మా నిర్ణయం మాకు ఉంటుంది.

కాబట్టి ఇలాంటి విభేదాలు పెరిగిపోవడం వల్ల నిర్మాతలకు నష్టం జరుగుతుంది. కాబట్టి టక్ జగదీష్ నిర్మాతలను రిలీజ్ డేట్ నాలుగైదు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేసుకోవాలని కోరుతున్నాం.. రిక్వెస్ట్ చేస్తున్నాం. లేకపోతే మా బతుకు ఉంటుంది. మేము ఏం చేయాలో నిర్ణయం తీసుకొంటాం అని సునీల్ నారంగ్ తెలిపారు.

Recommended Video

Nani- Sai Pallavi Starrer Shyam Singha Roy Launched
థియేటర్ వ్యవస్థను చంపేసి..

థియేటర్ వ్యవస్థను చంపేసి..

ప్రస్తుతం ఓటీటీల యాజమాన్యం థియేటర్లను, థియేటర్ల ఓనర్లను చంపేసే ప్రయత్నం జరుగుతున్నది. థియేటర్ల వ్యవస్థను భ్రష్టుపట్టిన తర్వాత ఓటీటీలు ఏక పక్షంగా వ్యవహరించే ప్రమాదం ఉంది. థియేటర్లులేకపోతే సినిమాను రిలీజ్ చేసి ప్రేక్షకులు చూసిన క్లిక్స్ ఆధారంగా డబ్బులు ఇస్తామనే డేంజర్ ముందున్నది. కాబట్టి ఓటీటీలను కాకుండా థియేటర్ వ్యవస్థను బతికించాల్సిన అవసరం ఉందని డిస్టిబ్యూటర్ విజేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X