బంగారం లాంటి చిత్రం అదే..

గోల్డెన్ పీకాక్ అవార్డు కింద రూ.40 లక్షల నగదు బహుమతి అందిస్తారు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ బహుమతిని ఈ ఏడాది నుంచి భారీగా పెంచారు. నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్, గోవా ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ హాజరయ్యారు. శ్రీలంక నటి మాలిని ఫోయెన్‌సెకా 'ఆకాశ కుసుమ్' చిత్రానికి స్పెషలీ జ్యూరీ అవార్డు (వెండి నంది) సొంతం చేసుకుంది.
ఈ విభాగంలో బహుమతి కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. మహాసత్తా (మరాఠీ), ప్రియదర్శన్ రూపొందించిన 'కాంచీవార'(తమిళ్) చిత్రాలు కూడా బరిలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌కి చెందిన పీటర్ చాన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటి టబు కూడా కమిటీలో సభ్యురాలు. 40 దేశాలకు చెందిన సుమారు 225 చిత్రాలను ఇఫిలో ప్రదర్శించారు.


Click it and Unblock the Notifications











