twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగారం లాంటి చిత్రం అదే..

    By Staff
    |

    Golden Peacock
    గోవాలో జరుగుతున్న 'ఇఫి' అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కజకస్థాన్‌ చిత్రం 'తల్పన్‌' బంగారు నెమలి(గోల్డెన్‌ పీకాక్‌) పురస్కారాన్ని గెలుచుకుంది. జర్మనీ, స్విట్జర్లాండ్‌, రష్యా, పోలెండ్‌ సహకారంతో దీన్ని నిర్మించారు.సెర్గి డివోర్ట్‌ సెవాయ్‌ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఔత్సాహిక దర్శకుడి అవార్డును కూడా ఆయన దక్కించుకున్నారు. అలనాటి సోవియట్‌ యూనియన్‌లో భాగమైన కజకస్థాన్‌కి చెందిన ఓ యువకుడు నేవీలో శిక్షణ పొందిన అనంతరం అల్లుకున్న పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందించారు.

    గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు కింద రూ.40 లక్షల నగదు బహుమతి అందిస్తారు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ బహుమతిని ఈ ఏడాది నుంచి భారీగా పెంచారు. నవంబరు 22న మొదలైన 39వ ఇఫి చిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి నటుడు కమల్‌హాసన్‌, గోవా ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ హాజరయ్యారు. శ్రీలంక నటి మాలిని ఫోయెన్‌సెకా 'ఆకాశ కుసుమ్‌' చిత్రానికి స్పెషలీ జ్యూరీ అవార్డు (వెండి నంది) సొంతం చేసుకుంది.

    ఈ విభాగంలో బహుమతి కింద రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందిస్తారు. మహాసత్తా (మరాఠీ), ప్రియదర్శన్‌ రూపొందించిన 'కాంచీవార'(తమిళ్‌) చిత్రాలు కూడా బరిలో నిలిచాయి. హాంగ్‌కాంగ్‌కి చెందిన పీటర్‌ చాన్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. నటి టబు కూడా కమిటీలో సభ్యురాలు. 40 దేశాలకు చెందిన సుమారు 225 చిత్రాలను ఇఫిలో ప్రదర్శించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X