»   » టాలీవుడ్లో...ఈ ప్రమాదకర పరిస్థితిని సత్వరం చక్కదిద్దాలి!

టాలీవుడ్లో...ఈ ప్రమాదకర పరిస్థితిని సత్వరం చక్కదిద్దాలి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెద్ద సినిమాల రిలీజ్‌కు సంబంధించి సరైన ప్లానింగ్‌ లేకపోవడం, అందుమూలంగా అవి ఒకటికి రెండుసార్లు వాయిదా పడుతుండడం.. చిన్న సినిమాల పాలిట శాపంగా మారుతోందని ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బిజినెస్‌ మాట దేవుడెరుగు.. ఏదో రకంగా తమ సినిమా రిలీజ్‌ అయితే చాలనే నిస్ఫృహ స్థితిలో నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్‌ చేసుకొని.. సినిమా రంగానికి ఓ దండం పెట్టి పారిపోతున్నారని.. అందువల్లే ప్రతి వారం అయిదారు సినిమాలకు తక్కువ కాకుండా విడుదలవుతున్నాయని ఆయన అన్నారు. వారానికి అయిదారు సినిమాలు విడుదలవ్వడం వల్ల ఏ సినిమాకూ కలెక్షన్లు ఉండడం లేదని.. అందరూ నష్టపోతున్నారని తుమ్మలపల్లి వివరించారు.

మిగతా భాషల్లో ఇటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని.. ఉదాహరణకు కన్నడలో నిర్మాతలంతా ఐకమత్యంతో తమ సినిమాలను ప్రాధాన్యతాక్రమంలో ఓ పద్ధతి ప్రకారం విడుదల చేసుకుంటారని ఆయన వివరించారు. పెద్దలు జోక్యం చేసుకొని.. ఈ పరిస్థితిన సత్వరం చక్కదిద్దాలని ఆయన డిమాండ్‌ చేసారు.

ఇప్పటివరకు 75 సినిమాలు తీసిన తాను.. రిలీజ్‌ డేట్‌ యాడ్స్‌ వేసాక కూడా.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవడం ఇంతకుముందెప్పుడూ జరగలేదని.. తొలిసారిగా తన తాజా చిత్రం ‘శీనుగాడి లవ్‌స్టోరి' చిత్రానికి ఆ పరిస్థితి ఎదురైందని రామసత్యనారాయణ ఆవేదన వ్యక్తపరిచారు.

 Tummalapalli Rama Satyanarayana's Seenu Gadi Love Story

తొలుత తమ చిత్రాన్ని జూన్‌ 12న విడుదల చేస్తామని ప్రకటించామని.. కానీ పెద్ద సినిమాల విడుదలకు సంబంధించిన గందరగోళం వల్ల జూన్‌ 26కు వాయిదా వేసామని.. కానీ.. అదే కారణం వల్ల.. ఆరోజు కూడా సినిమాను రిలీజ్‌ చేసుకోలేకపోయామని.. చివరికి జులై 3న ‘శీనుగాడి లవ్‌స్టోరి'ని విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తుమ్మలపల్లితోపాటు ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, వడ్లపట్ల మోహన్‌ పాల్గొన్నారు.

నయనతార`ఉదయనిధి స్టాలిన్‌ జంటగా నటించిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిందని, తెలుగులోనూ మంచి విజయం సాధించడం తధ్యమని తుమ్మలపల్లి అన్నారు. ఇతర సినిమాల విడుదలతో సంబంధం లేకుండా.. తమ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో జులై 3న రిలీజ్‌ చేస్తామని ఆయన ప్రకటించారు. ‘రెడ్‌ జైంట్‌' ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో.. భీమవరం టాకీస్‌ పతాకంపై రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు!!

English summary
Tummalapalli Rama Satyanarayana's Seenu Gadi Love Story release details.
Please Wait while comments are loading...