‘తూనీగ తూనీగ’ సెన్సార్ రిపోర్ట్

ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ... 'తూనీగ తూనీగ' పాటలు విడుదలై మంచి ఆదరణ అందుకున్నాయి. సుమంత్ అశ్విన్‌కు హీరోగా ఈ సినిమా ద్వారా మంచి బిగినింగ్ లభించనుంది. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకుడిగా కంటే మేకర్‌గా ఎక్కువ ఆలోచించి గ్రాండ్‌గా తీశారు. ఈ చిత్రంలో నేను అసోసియేట్ అవటం ఆనందంగా ఉంది. సినిమాకు సెన్సార్ వారు క్లీన్ 'U' సర్టిఫికెట్ ఇచ్చారు. కుంటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అన్నారు.
జూలై 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. 2012 హిట్ మూవీస్‌లో 'తూనీగ తూనీగ' టాప్‌లో నిలవడం ఖాయం అన్నారు. రియా, నాగబాబు, పరుచూరి వెంకటేశ్వ రావు, ప్రభు, షాయాజీ షిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కార్తీక్ రాజా, కెమెరా : ఎస్. గోపాల్ రెడ్డి, మోహన్ కృష్ణ, రచన : పరుచూరి బ్రదర్స్, భూపతి రాజా, కూర్పు : కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాణం : పద్మిని ఆర్ట్స్, సమర్పణ : దిల్ రాజు, నిర్మాత : మాగంటి రాంచంద్రన్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : ఎంఎస్. రాజు


Click it and Unblock the Notifications











