twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘తూనీగ తూనీగ’ సెన్సార్ రిపోర్ట్

    By Bojja Kumar
    |

    Tuneega Tuneega
    తన తనయుడు సుమంత్ అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో రూపొందించిన 'తూనీగ తూనీగ' చిత్రం జూలై 20న విడుదలకు సిద్ధం అవుతోంది. దిల్ రాజు సమర్పణలో మాగంటి రామ్ చంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి క్లీన్ 'U' సర్టిఫికెట్ జారీ చేశారు.

    ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు దిల్ రాజు మాట్లాడుతూ... 'తూనీగ తూనీగ' పాటలు విడుదలై మంచి ఆదరణ అందుకున్నాయి. సుమంత్ అశ్విన్‌కు హీరోగా ఈ సినిమా ద్వారా మంచి బిగినింగ్ లభించనుంది. ఈ చిత్రాన్ని ఎం.ఎస్. రాజు దర్శకుడిగా కంటే మేకర్‌గా ఎక్కువ ఆలోచించి గ్రాండ్‌గా తీశారు. ఈ చిత్రంలో నేను అసోసియేట్ అవటం ఆనందంగా ఉంది. సినిమాకు సెన్సార్ వారు క్లీన్ 'U' సర్టిఫికెట్ ఇచ్చారు. కుంటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా అన్నారు.

    జూలై 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాము. 2012 హిట్ మూవీస్‌లో 'తూనీగ తూనీగ' టాప్‌లో నిలవడం ఖాయం అన్నారు. రియా, నాగబాబు, పరుచూరి వెంకటేశ్వ రావు, ప్రభు, షాయాజీ షిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : కార్తీక్ రాజా, కెమెరా : ఎస్. గోపాల్ రెడ్డి, మోహన్ కృష్ణ, రచన : పరుచూరి బ్రదర్స్, భూపతి రాజా, కూర్పు : కె.వి.కృష్ణారెడ్డి, నిర్మాణం : పద్మిని ఆర్ట్స్, సమర్పణ : దిల్ రాజు, నిర్మాత : మాగంటి రాంచంద్రన్, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : ఎంఎస్. రాజు

    English summary
    
 MS Raju's directorial film Tuneega Tuneega has cleared the censor with a clean U certificate, and is all set to hit the floors on July 20. Raju said that the film is a romantic entertainer which has his son Sumanth Ashwin and Rhea in the lead pair.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X