రామ్ చరణే బ్రాండ్ అంబాసిడర్, కస్టమర్లను ఆకర్షిస్తాడా?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ విమానయాన రంగంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. 'టర్భో మేఘ' అనే సంస్థలో చరణ్ కూడా డైరెక్టర్‌గా చేరారు. ఈ సంస్థకు రామ్ చరణే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నాడు. సంస్థ తరుపున ప్రచారం చేసి కష్టమర్లను ఆకట్టుకోనున్నాడు.
ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో ఒకరైన వి ఉమేష్ ఓ ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....మా సంస్థ బలం రామ్ చరణ్ బ్రాండ్ ఇమేజ్. ఆయన ఇమేజ్ ఆధారంగా మా సంస్థ సేవలను నాణ్యత కోరే ప్రియాణికులకు అందుబాటులోకి తెస్తాం. ఎయిర్ వేస్ వ్యాపారంలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ నిష్పత్తి పెంచుకుంటే లాభాలను ఆర్జించవచ్చు. అని తెలిపారు. బలమైన ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ మా సంస్థ డైరెక్టర్ కావడం వల్ల మూలదన సమీకరణ పెద్ద సమస్య కాదని ఆయన తెలిపారు.

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం రామ్ చరణ్ గోవిందుడు అందరి వాడేలే చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు. గోవిందుడు అందరి వాడేలే చిత్రం ఆడియో ని ఆగస్టు 20న విడుదల చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే టీజర్ ని దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజున అంటే ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి టాకీ పార్టు పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్


Click it and Unblock the Notifications











