»   » ఉత్తమ దర్శకుడిగా రోమన్‌ పొలన్‌స్కీ

ఉత్తమ దర్శకుడిగా రోమన్‌ పొలన్‌స్కీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

జర్మనీలో గత పది రోజులుగా జరుగుతున్న 60వ బెర్లిన్‌ చిత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో ప్రదర్శించిన పలు చిత్రాలకు జ్యూరీ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ దర్శకుడి విభాగంలో ఫ్రెంచ్‌ దర్శకుడు రోమన్‌ పొలన్‌స్కీ 'సిల్వర్‌ బేర్‌' సొంతం చేసుకున్నారు. 'ది ఘోస్ట్‌ రైటర్‌' చిత్రానికిగాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. అలాగే టర్కీ దర్శకుడు సెమిహ్‌ కల్పనోగ్లూ తీసిన చిత్రం 'బల్‌'(హనీ) ఉత్తమచిత్రంగా ఎంపికై 'గోల్డెన్‌ బేర్‌' అవార్డు దక్కించుకుంది.

ఫ్లోరియన్‌ సెర్బన్‌ రూపొందించిన 'ఇఫ్‌ ఐ వాంట్‌ టు విజిల్‌' చిత్రం 'గ్రాండ్‌ ప్రైజ్‌ ఆఫ్‌ ది జ్యూరీ' గా ఎంపికైంది. ఇదే చిత్రం 'ఆల్‌ఫ్రెడ్‌ బార్‌ ప్రైజ్‌'ను సైతం సొంతం చేసుకొంది. జపాన్‌ తార షినోబు తెరజిమ ఉత్తమనటిగా ఎంపికై 'సిల్వర్‌ బేర్‌' అందుకున్నారు. ఉత్తమనటుడు అవార్డుకు గ్రిగొరీ డోబ్రిజిన్‌, సెర్జీ పుస్కెపలిస్‌లు సంయుక్తంగా ఎంపికయ్యారు. చైనా దర్శకుడు వాంగ్‌ క్వాన్‌ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకున్నారు. జపాన్‌ దర్శకుడు యోజి యమద 'గోల్డెన్‌ కెమెరా'ను దక్కించుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu