మధు ప్రకాశ్ భార్య కేసులో కొత్త ట్విస్ట్.. నేను కూడా చేశానన్న నటుడు.. అసలు విషయం చెప్పిన పోలీసులు

Recommended Video

New Twist In Baahubali Fame Madhu Prakash-Bharati Case | Filmibeat telugu

ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ భార్య భారతి (34) మంగళవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఎన్నో కోణాలు బయటకు వస్తున్నాయి. మధు ప్రకాశ్ వేరే నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, భార్యను వేధిస్తున్నాడని వార్తలు వచ్చాయి. దీనిపై మధు ప్రకాశ్ ఒక రకంగా చెబుతుంటే.. పోలీసులు మాత్రం అసలేం జరిగిందో వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్‌లో పరిచయం

ఫేస్‌బుక్‌లో పరిచయం

గుంటూరుకు చెందిన పుట్ట లక్ష్మణ్‌రావు కుమార్తె భారతి హైదరాబాద్ ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఎంబీఏ చదవడం కోసం లండన్‌ వెళ్లింది. అక్కడ చదువు పూర్తియిన తర్వాత ఉద్యోగం సంపాదించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మధు ప్రకాశ్‌తో ఆమెకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

ఫేస్‌బుక్ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇద్దరి ఇళ్లల్లో చెప్పారు. మొదట భారతి కుటుంబ సభ్యులు దీనికి ఒప్పుకోకున్నా.. తర్వాత కూతురి కోసం సరేనన్నారు. దీంతో వీరిద్దరూ 2015లో అగ్నిసాక్షిగా ఒక్కటయ్యారు. అనంతరం భారతి లండన్‌లో ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చేసింది. చనిపోయే ముందు వరకు ఇక్కడే ఉద్యోగం చేసింది.

అదనపు కట్నం కోసమే..

అదనపు కట్నం కోసమే..

కొంతకాలంగా ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. దీనికి తోడు పెళ్లి సమయంలో భారతి తల్లిదండ్రులు ఇచ్చిన రూ.15 లక్షలతో పాటు అదనపు కట్నం కోసం మధుప్రకాశ్‌ భారతిని వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఆ తర్వాత మధు ప్రకాశ్ బయటకు వెళ్లడం.. ఆమె ఆత్మహత్య చేసుకోవడం తెలిసిన విషయమే.

కీలక వ్యాఖ్యలు చేసిన మధు ప్రకాశ్

కీలక వ్యాఖ్యలు చేసిన మధు ప్రకాశ్

మధు ప్రకాశ్ ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధుల వల్ల అతడు కీలక విషయాలను ప్రస్తావించాడు. ‘మాకు తరచూ గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా అయింది. గతంలో చాలా సార్లు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఒకానొక సందర్భంలో నేను కూడా ఆత్మహత్యాయత్నం చేశాను' అని అతడు వెల్లడించాడు.

నటితో వివాహేతర సంబంధం

నటితో వివాహేతర సంబంధం

మరోవైపు, భారతి కుటుంబ సభ్యులు మాత్రం మధు ప్రకాశ్‌కు మరో సీరియల్ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో భారతిని వదలించుకోడానికి అదనపు కట్నం కావాలని హింసిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X