టీవీ యాక్టర్, బాహుబలి ఫేం మ‌ధు ప్రకాష్ ఇంట్లో విషాదం.. వీడియో కాల్ చేసి ఆత్మహత్య

Recommended Video

TV Actor,Baahubali Fame Madhu Prakash Wife Is No More || Filmibeat Telugu

ప్రముఖ టీవీ నటుడు, 'బాహుబలి' ఫేం మధు ప్రకాశ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య భారతి (34) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని మణికొండలో ఈ ఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం ఇది బయటకు వచ్చింది. భార్య భర్తల మధ్య కొద్దిరోజులుగా జరుగుతున్న గొడవలే దీనికి కారణం అని తెలుస్తోంది.

టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు

టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు

టీవీ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన మధు ప్రకాశ్.. బాహుబలి సహా పలు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. ఆయన రెండేళ్ల క్రితం భారతిని వివాహం చేసుకున్నారు. ఆమె హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో మణికొండలోని పంచవటి కాలనీలో అత్తామామలు, మరిదితో కలిసి ఉంటున్నారు.

కొంత కాలంగా గొడవలు

కొంత కాలంగా గొడవలు

కొంత కాలంగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మధు ప్రకాశ్ షూటింగ్ నుంచి ఆలస్యంగా రావడంతో ఆమె ప్రశ్నించేదని, ఈ కారణంగా ఇద్దరి మధ్య వాదోపవాదనలు జరిగేవని సమాచారం. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా గొడవ జరిగినట్లు తెలిసింది. దీంతో మంగళవారం ఉదయం జిమ్‌కు వెళ్లిన మధు ప్రకాశ్.. అటు నుంచి అటే షూటింగ్‌కు వెళ్లిపోయాడు.

వీడియో కాల్ చేసి బెదిరింపు

వీడియో కాల్ చేసి బెదిరింపు

మంగళవారం మధ్యాహ్నం సమయంలో భారతి.. ఆయనకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిందని, అయితే తరచూ బెదిరిస్తుంటుంది కాబట్టి ఆయన మామూలుగానే అనుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు. ఇక, షూటింగ్ ముగించుకుని మంగళవారం 7.30 గంటలకు ఇంటికి వెళ్లాడు మధు ప్రకాశ్.

ఉరి వేసుకుని కనిపించడంతో..

ఉరి వేసుకుని కనిపించడంతో..

నేరుగా తమ బెడ్ రూమ్‌ దగ్గరకు వెళ్లగా.. లోపల గడియ పెట్టి ఉంది. దీంతో అనుమానం వచ్చిన మధు ప్రకాశ్.. ఎలాగోలా తలుపులు తెరిచి చూడగా.. ఆమె ఉరి వేసుకుని కనిపించింది. దీంతో షాకైన ఆయన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో భారతి కుటుంబ సభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు.

 మధు ప్రకాశ్‌పై ఫిర్యాదు

మధు ప్రకాశ్‌పై ఫిర్యాదు

ఈ వ్యవహారంలో భారతి కుటుంబ సభ్యులు మధు ప్రకాశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మధు ప్రకాష్ వేధింపులే ఆత్మహత్యకు కారణం అని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం లండన్ నుంచి వచ్చి మరీ అతడిని పెళ్లి చేసుకుంటే తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని భారతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X