»   »  బాహుబలిని కలిసేందుకు సీత వచ్చింది (ఫోటో)

బాహుబలిని కలిసేందుకు సీత వచ్చింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలిని సీత కలవడం ఏమిటి? అనుకుంటున్నారా.... అదేనండి మన బాహుబలి స్టార్ ప్రభాస్‌ను హిందీ సీరియల్ 'సియా కె రామ్'లో సీత పాత్రదారి మదిరక్షి స్వయంగా వచ్చి కలిసింది. 'వనవాస్' టీవీ షోలో షూటింగు కోసం హైదరాబాద్ లోని రామోజీఫిల్మ్ సిటీకి మదిరక్షి వచ్చింది.

రామోజీ ఫిల్మ్ సిటీలోనే బాహుబలి-2 షూటింగ్ జరుగుతుండటంతో ప్రభాస్ ను కలిసేందుకు అక్కడికి వెళ్లింది మదిరక్షి. ప్రభాస్ తో కలిసి ఫోటోలు దిగడం, మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉందని, సియా కె రామ్ సీరియల్ గురించి, అందులో నా పాత్ర గురించి తెలుసని ప్రభాస్ చెప్పడంతో సర్ ప్రైజ్ అయ్యానని మదిరక్షి చెప్పుకొచ్చింది.

TV Actress Met Baahubali Prabhas

ప్రభాస్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా మదిరక్షి సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. మదిరక్షితో పాటు వనవాస్ టీవీ షో యూనిట్ సభ్యులు కూడా ప్రభాస్ ను కలిసి పోటోస్ దిగారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో ఎంత పాపులర్ అయ్యారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

English summary
Actress Madirakshi, who stars as Sita in TV show "Siya Ke Ram", got a chance to meet our very own Baahubali, Prabhas during the shoot of the mythological show in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu