అమ్మాయిల హృదయాలు గల్లంతు.. ప్రభాస్‌పై టీవీ నటి హాట్ ట్వీట్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు 39 వ జన్మదిన వేడుక జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ ప్రముఖుల నుంచి ప్రభాస్ కు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యువతుల హృదయాలకు కళ్లెం వేసే సమ్మోహన రూపం, ఆరడుగుల కటౌట్ ప్రభాస్ సొంతం. ప్రభాస్ బర్త్ డే సంద్భరంగా చాలా మంది సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు. కానీ మోడల్, టివి నటి మున్మున్ దత్త ట్విట్టర్ వేదికగా ప్రభాస్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది.
ఏమని మాట్లాడను
ప్రభాస్ గురించి ఏమని మాట్లాడను. దేశంలోని అమ్మాయిల హృదయాలని కొల్లగొట్టే రూపం అతడిది. నీతో ప్రేమలో, మోహంలో పడేలా చేశావు. నటనతో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలు చరిత్రలో నిలిచిపోయేలా చేశావు. ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మున్మున్ దత్తా ట్వీట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ట్విట్టర్ వేదికగా ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కు జన్మదిన శుభాకాంక్షలు. రాబోవు రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ ఆకాంక్షించింది.

అబ్బురపరిచే విన్యాసాలు
ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 200 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభాస్ సరసన ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

పీరియాడిక్ చిత్రం
ఇటీవల ప్రభాస్ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శత్వంలో ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











