ఆ టీవీ నటి కూడా....హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది!
హైదరాబాద్: పలువురు టీవీ నటీమణులు ఈ మధ్య కాలంలో సినిమా హీరోయిన్ల అవతారం ఎత్తుతుండటం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో టీవీ నటి కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె పేరు ‘సోనారిక'. ‘హర హర మహదేవ' టీవీ సీరియల్‌లో పార్వతి పాత్రదారిణి. ఆమె తెలుగు మూవీ ‘జాదూగాడు'లో హీరోయిన్ గా ఎంపికయింది. ఈ చిత్రంలో ఆమె నాగ శౌర్యకు జోడీగా నటించబోతోంది.

జాదూగాడు సినిమా విషయానికొస్తే....ఊహలు గుసగుసలాడే', ‘దిక్కులు చూడకు రామయ్యా', ‘లక్ష్మి రావు మా ఇంటికి' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగ శౌర్య...త్వరలో ‘జాదూగాడు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత వీ.వీ.ఎస్.ప్రసాద్ సత్యా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
‘చింతకాయల రవి' చిత్ర దర్శకుడు యోగేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమా ఫస్ట్ విడుదల చేశారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











