పవన్ కళ్యాణ్ ప్రేమలో సెక్సీ యాంకర్ అనసూయ!
కాలేజీలో ప్రేమించమంటూ పవన్ కళ్యాణ్ వెంట పడే అమ్మాయిగా ఆమె కనిపిస్తుందట. అనసూయ ఈ మధ్య టీవీ షోల ద్వారా బాగా పాపులర్ అవడంతో పాటు, హాట్ అండ్ సెక్సీ ఒంపు సొంపులతో యూత్ మతి పోగొడుతోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆమెతో ఇందులో ఓ పాత్ర చేయించడానికి ప్లాన్ చేసాడట.
ఈ సినిమా మాత్రమే కాదు, రామ్ గోపాల్ వర్మ సినిమాలో కూడా అనసూయ ఓ పాత్రకు ఎంపికయినట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ సినిమానే ముందుగా విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఐటం సాంగులు చేయడానికి కూడా తాను రెడీ అనే సంకేతాలు పంపుతుందట ఈ హాట్ యాంకర్.
చలాకీ తనం, వాక్ చాతుర్యం మాత్రమే కాదు...సెక్సీగా మత్తెక్కించే అందం ఆమె సొంతం. ఆమె వేసే మోడ్రన్, చిట్టిపొట్టి కురచ దుస్తువులు ఆమె సెక్సీ ఆటిట్యూడ్‌కు మరింత వన్నెతుస్తుంటాయి. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్లంతా ఆమెతో యాంకరింగ్ చేయించడానికే మెగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా తన రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిందట అనసూయ. సినిమా ఫంక్షన్లు, ఇతర ఈవెంట్లకు యాంకరింగ్ చేయడానికి గంటకు రూ. లక్ష చొప్పున వసూలు చేస్తోందట. పలువురు ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా ఆమె అడిగిన మొత్తం ముట్టజెప్పడానికి ఏమాత్రం వెనకాడటం లేదని ఫిల్మ్ నగర్ టాక్. సాధారణంగా ఇతర యాంకర్లు గంటకు రూ. 30 నుంచి 50 వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications












