Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బిత్తిరి సత్తిలో మరో కోణం.. తుపాకి రాముడిగా.. సుకుమార్ ఏమన్నారంటే..
బిత్తిరి సత్తి హీరోగా 'తుపాకీ రాముడు'ప్రముఖ పాపులర్ యాంకర్, నటుడు బిత్తిరిసత్తి కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'తుపాకీ రాముడు'. 'బతుకమ్మ' ఫేమ్, సీనియర్ దర్శకులు టి. ప్రభాకర్ దర్శకత్వంలో రసమయి ఫిల్మ్స్ పతాకంపై రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకుని, శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించారు.
తుపాకీ రాముడుగా సత్తి
ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘‘బిత్తిరిసత్తిగా అందరికీ పరిచయమైన సత్తి.. తుపాకీ రాముడు చిత్రంలో మరో కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా సత్తికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దర్శకుడు ప్రభాకర్‌గారు నాకు పరిచయమైన తొలి దర్శకుడు. సీనియర్ దర్శకుడైన ప్రభాకర్‌గారు ఈ చిత్రాన్ని ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించి ఉంటారని ఆశిస్తున్నాను. ఈ చిత్రం అందరికీ మంచి పేరు, సక్సెస్‌ని ఇవ్వాలని కోరుకుంటున్నాను..'' అన్నారు.
వైవిధ్యంగా బిత్తిరిసత్తి
చిత్ర
దర్శకుడు
టి.
ప్రభాకర్
మాట్లాడుతూ..
‘‘యూనివర్శల్
కథాంశంతో
రూపొందుతున్న
ఈ
చిత్రంలో
అన్ని
వర్గాల
ప్రేక్షకులను
అలరించే
అంశాలు
పుష్కలంగా
ఉంటాయి.
బిత్తిరిసత్తిని
ఈ
చిత్రంలో
వైవిధ్య
కోణంలో
చూపిస్తున్నాము.
రసమయి
బాలకిషన్‌గారు
కాంప్రమైజ్
కాకుండా
ఈ
సినిమాకి
సహకరించారు.
పూర్తి
వినోదాత్మకంగా
ఉండబోతోన్న
ఈ
చిత్రం
ప్రేక్షకులందరినీ
తప్పకుండా
ఎంటర్టైన్
చేస్తుంది..''
అని
అన్నారు.
సత్తిని మా బ్యానర్లో
నిర్మాత రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ‘‘సత్తిని మా బ్యానర్లో హీరోగా పరిచయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రేక్షకులని ఈ చిత్రం చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. సినిమా అంతా ఎంతో వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రం సత్తికి మంచి పేరునే కాకుండా బిజీ నటుడిని కూడా చేస్తుంది. ఇంకా రెండు పాటలు చిత్రీకరణ జరపాల్సి ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా దాదాపు చివరికి వచ్చాయి. త్వరలోనే ఇతర వివరాలను ప్రకటిస్తాము..'' అన్నారు.
నటీనటులు, సాంకేతిక వర్గం
బిత్తిరిసత్తి, ప్రియ, ఆర్.ఎస్. నందా, గౌతంరాజు, రవి ఆదేష్, అంబటి వెంకన్న, అనురాగ్, పోశం, మాధవి, గాయత్రి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి, మాటలు: సిద్దార్ధ, రవి ఆదేష్, ఎడిటింగ్: జె.పి., పాటలు: అభినయ శ్రీనివాస్, మిట్టపల్లి సురేందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మక్కపాటి చంద్రశేఖర్‌రావు, మక్బుల్ హుస్సేన్, నిర్మాత: రసమయి బాలకిషన్; రచన-సంగీతం-దర్శకత్వం: టి. ప్రభాకర్.