twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న్యూడ్ సీడీలంటూ భర్తపై టీవీ యాంకర్ కంప్లైంట్

    By Srikanya
    |

    Charminar
    తన భర్త వద్ద న్యూడ్ సీడిలు ఉన్నాయని, సీక్రెట్ కెమెరాలతో వాటిని తీసాడని తన భర్తపై టీవీ యాంకర్ పోలీస్ కంప్లైంట్ చేసి మీడియాకెక్కటం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే టీవి యాంకర్ మేఘనా రెడ్డి ఓ పాపులర్ టీవీ ఛానెల్ లో పనిచేస్తోంది. ఆమె భర్త కట్నం ఇంకా తెమ్మంటూ వేధిస్తున్నాడని సిసియస్ ఉమెన్ పోలీస్ స్టేషన్ బషీర్ బాగ్ లో కంప్లైంట్ చేసింది. ఆమె భర్త కోటీలో భార్గవీ సర్వీస్ సెంటర్ నడుపుతాడు. అక్కడ హ్యాండీ క్యామ్ సర్వీస్, సేల్స్ చేస్తూంటారు. ఆమె తన కంప్లైంట్ లో... మా వివాహం అయ్యాక, ఆయన నన్ను మరింత కట్నం తెమ్మని వేధించాడు.

    కొద్ది రోజుల తర్వాత నేను కొన్ని న్యూడ్ సీడిలు చూడటం జరిగింది. దానిపై ఆయన్ని ప్రశ్నించాను. ఆయన వాటిని ఎవరికీ లీక్ చేయద్దని నన్ను బెదిరించాడు. అంతేగాక తనకు ఈస్ట్ జోన్ ఎసిపి సపోర్టు ఉందని మరీ బెదిరించాడని చెప్పింది. అలాగే తను సికింద్రాబాద్ లో ఇద్దరు పిల్లలుతో ఉంటున్నాని చెప్పుకొచ్చింది. అంతేగాక అమ్మాయిలను న్యూడ్ గా ఇలా కెమెరాలో బంధించి ఆ తర్వాత వారిని వ్యభిచారం చెయ్యమంటూ బ్లాక్ మెయిల్ చేస్తూంటాడని చెప్పుకొచ్చింది. ఇక తరుచుగా తన భర్త బ్యాంకాక్,మలేషియా కి లగ్జరీ టూర్స్ నిమిత్తం వెళ్తూండాని ఆ కంప్లైంట్ లో వివరించింది. వివరాలు తాను రుజువులతో సహా మీడియాకు వెల్లడిస్తానని అంది.

    English summary
    CH Meghana Reddy, a TV Anchor has registered a complaint against her husband in the CCS Women police station at Basheerbagh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X