రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ యాంకర్.. జనగాం ఆసుపత్రిలో చికిత్స!
తన ప్రత్యేకమైన యాకరింగ్ శైలితో ఆకట్టుకునే యాంకర్ లోబో(మొహమ్మద్ కయీమ్) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో లోబోకు స్వల్ప గాయాలు ఆయనట్లు తెలుస్తోంది. లోబో ప్రయాణిస్తున్న కారు జనగాం జిల్లా రఘునాథ పల్లి వద్ద ఆటోని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. వేగంగా స్పందించిన స్థానికులు వారందరిని జనగాం ఆసుపత్రికి తరలించారు. లోబోతో సహా గాయపడ్డ వారంతా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలని ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

జనగాం డిఎస్పీ మల్లారెడ్డి స్వయంగా గాయపడ్డవారిని పరామర్శించారు. స్టార్ మాలో యాంకర్ గా పనిచేస్తున్న లోబో, కుమారి 21 ఎఫ్ వంటి చిత్రాలలో నటుడిగా కూడా మెరిశాడు.


Click it and Unblock the Notifications











