కౌశల్ దమ్ముంటే రా చూసుకుందాం, తనీష్‌తో కుమ్మక్కు అని నిరూపిస్తే.. టివి యాంకర్!

Recommended Video

TV Anchor Murthy Open Challenge To Kaushal Manda | Filmibeat Telugu

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. కౌశల్ ఆర్మీ అందించిన విరాళం విషయంలో నిధులు దుర్వినియోగానికి కౌశల్ పాల్పడ్డాడనే ఆరోపణలు మొదలయ్యాయి. కౌశల్ ఆర్మీకి చెందిన వ్యక్తులే మీడియా ముందుకు వచ్చి ఈ ఆరోపణలు చేయడంతో సంచలనంగా మారింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు గురువారం రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కౌశల్ ఆగ్రహంతో ఊగిపోతూ తనీష్, ప్రముఖ యాంకర్ మూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ విషయమే హాట్ టాపిక్ గా మారుతోంది. కౌశల్ విమర్శలకు యాంకర్ మూర్తి అంతే ఘాటుగా బదులిచ్చారు.

దమ్ముంటే రా

దమ్ముంటే రా

ప్రముఖ టివి ఛానల్ యాంకర్ అయిన మూర్తి కౌశల్ ఆరోపణల గురించి మాట్లాడుతూ.. నాకు నా సంస్థకు దమ్ముంది.. మీరు చేస్తున్న ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగితే తాను జర్నలిజం వదిలి వెళ్లిపోతానని మూర్తి అన్నారు. మీకు దమ్ముంటే మేము చేస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోండి. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మా వద్ద ఉన్నాయి. మీరు కేరళ ఫ్లడ్స్ కు 10 లక్షల విరాళం ఎక్కడ ఇచ్చారు.. ఎవరి ద్వారా పంపారు, చెక్ వివరాలు ఏంటి అని మూర్తి ప్రశ్నించారు. ఫౌండేషన్ ద్వారా ఇచ్చాం అంటున్నారు. ఫౌండేషన్ లో ఎంట్రీ ఏది అని మూర్తి అన్నారు.

10 లక్షల మంది ఆర్మీ

10 లక్షల మంది ఆర్మీ

నాకు 10 లక్షల మంది ఆర్మీ ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా.. మీ ఆర్మీలో ఏ ఒక్కరి చేత అయినా మూర్తి తప్పు చేశాడు అని నిరూపిస్తే ఉరి తీయించుకోవడానికి నేను సిద్ధం. నేను చనిపోయిన పాతికేళ్ల తర్వాత అయినా సరే నాపై చేస్తున్న ఆరోపణలు నిరూపించండి. అలా చేయగలిగితే నా సమాధి వద్దకు వచ్చి జర్నలిస్ట్ ద్రోహి అని ముద్ర వేయండి. ఇది నా బహిరంగ సవాల్.. మీరు సిద్దమేనా అని మూర్తి కౌశల్ కు సవాల్ విసిరారు.

 తనీష్‌తో కుమ్మక్కు

తనీష్‌తో కుమ్మక్కు

తనీష్ తో కుమ్మక్కు కావడం వలెనే మూర్తి తనపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏ సందర్భంలో అయినా సరే తనీష్ తో కలసి నేను కాఫీ తాగినట్లు నిరూపించినా శిక్షకు నేను సిద్ధం అని మూర్తి అన్నారు. తనీష్ తో రహస్య ఒప్పదం చేసుకుని మూర్తి ఇలా తనకు వ్యతిరేకంగా డిబేట్లు నిర్వహిస్తున్నారని కౌశల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. స్టార్ మా మీకు 34 లక్షలు ఇస్తే.. మీరు విరాళంగా ప్రకటించింది కేవలం 25వేలు అని మూర్తి అన్నారు.

 బలవంత పెట్టడం వలనే

బలవంత పెట్టడం వలనే

సదరు మీడియా సంస్థలో తనీష్ తో మూర్తి డిబేట్ నిర్వహిస్తుండగా ఈ ఆరోపణలు చేశారు. తనీష్ కూడా కౌశల్ ఆర్మీకి చెందిన ఓ వ్యక్తి ఆడియోని వినిపించాడు. కౌశల్ బలవంత పెట్టడం వలనే తాము తనీష్ ని తిట్టామని, అందుకు తనీష్ కు క్షమాపణలు చెబుతున్నామని ఆ ఆడియోలో ఉంది. ఈ ఆడియో బయటకు వచ్చిన తర్వాత అతడు కౌశల్ ఆర్మీకి చెందిన వ్యక్తి కాదని కౌశల్ బుకాయించినట్లు తనీష్ తెలిపాడు. అంతకు ముందు అతడు మా వ్యక్తే అని కౌశల్ చెప్పిన విషయాన్ని కూడా తనీష్ గుర్తుచేశాడు.

బెదిరిస్తే బెదిరిపోవాలా

బెదిరిస్తే బెదిరిపోవాలా

నాకు లక్షల మంది ఆర్మీ ఉంది.. వారందరిచే నేను ట్రోలింగ్ చేయిస్తా అని ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేస్తారు అని మూర్తి ప్రశ్నించారు. మీరు బెదిరిస్తే మేము బెదిరిపోవాలా.. మీతో సినిమా చేయడానికి ఒప్పుకొని వారంతా క్రిమినల్స్ అయిపోతారా అని మూర్తి అన్నారు. ఓ సందర్భంలో గీతా మాధురి పిక్క బలం అని ప్రస్తావించారు. మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలేనా చేసేది అని మూర్తి మండిపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X