twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా పొట్టగొడుతున్నారు..!, చిరంజీవి, నాగార్జునలకు టీవీ సెగ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తారా స్థాయికి చేరడంతో చిరంజీవి, నాగార్జున అంతర్మథనంలో పడ్డారు. గత కొంత కాలంగా తెలుగు టీవీ ఆర్టిస్టులు డబ్బింగ్ సీరియళ్లను నిషేదించాలంటూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

    ఇతర టీవీ ఛానళ్లు అన్నీ డబ్బింగ్ సీరియళ్లను ఆపి వేస్తామని...తెలుగు టీవీ కళాకారులు పొట్టగొట్టే అలాంటి సీరియళ్ల ప్రసారాళను నిలిపి వేస్తారామని హామీ ఇచ్చారు. అయితే నాగార్జు, చిరంజీవి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్న 'మాటీవీ' వారు మాత్రం డబ్బింగ్ సీరియళ్ల ప్రసారం నిలిపి వేయడానికి ససేమిరా అంటున్నారు.

    ఈ క్రమంలో మంగళవారం తెలుగు టీవీ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు టీవీ కళాకారులు హైదరాబాద్ లోని మాటీవీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. డబ్బింగ్ సీరియళ్లను ప్రొత్సహిస్తూ మా పొట్టగొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసారు. మాటీవీలో డైరెక్టర్లుగా ఉన్న నాగార్జున, చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకుంటే తప్ప మాటీవీలో డబ్బింగ్ సీరియళ్లు ఆగే పరిస్థితి లేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో టీవీ ఆర్టిస్టులు, మాటీవీ సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. డబ్బింగ్ సీరియల్స్ నిలిపి వేస్తామని స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని టీవీ ఆర్టిస్టులు స్పష్టం చేసారు.

    ఇటీవల టీవీ ఆర్టిస్టుల ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శకరత్న దాసరి నారాయణరావు కూడా చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడారు. డబ్బింగ్ సీరియళ్లు నిలిపివేయడానికి అన్ని ఛానల్స్ ఒప్పుకున్నా...చిరంజీవికి చెందిన మాటీవీ మాత్రం వారి గోడు పట్టించుకోవడం లేదని, ఒక బాధ్యత గల కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న చిరంజీవికి ఇది తగునా అనే విధంగా పరోక్షంగా చురకలంటించారు దాసరి నారాయణరావు.

    English summary
    Telugu TV Parirakshana samiti members held a dharna in front of the office of Maa TV on Tuesday, to protest the telecast of dubbed serials.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X