ఆ టీవీలో చిరు వార్త లేదు!!?
అత్యధిక సర్క్యూలేషన్ గల పత్రిక మాదిరిగానే ఆ టీవీ కూడా చిరంజీవి న్యూస్ ను ప్రసారం చేయలేదు. టెలివిజన్ ఛానళ్లన్నీ మంగళవారం పొద్దుటి నుంచి చిరంజీవి వార్తను కోడై కూస్తుంటే ఈ చానెల్ మాత్రం అది కూడా ఒక వార్తేనా అన్నట్టు ఆ వార్తను ప్రసారం చేయలేదు. మిగతా చానెళ్ళన్నీ విశ్లషణలు, ఇంటర్వ్యూలతో హోరెత్తించగా ఆ టీవీ మాత్రం అసలు ఈ వార్త ఊసెత్తలేదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మేం వార్తలు చూపించం అన్నట్టుంది ఆ చానెల్ వైనం. ఇదెంతవరకు సమంజసమనే అంశాన్ని చర్చించాల్సిన అవసరం లేదు కానీ న్యూస్ ను న్యూస్ గా చూపించాల్సిన అవసరం మాత్రం కచ్చితంగా ఉంది. కాదంటారా.


Click it and Unblock the Notifications











