TV5 మూర్తి రియల్ లైఫే...ప్లే బ్యాక్ మూవీ అంట...!
తనదైన వాక్ చాతుర్యంతో తెలుగు మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న TV5 మూర్తి త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైనా మెరవబోతున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ప్లే బ్యాక్ సినిమాలో మూర్తి తన రియల్ లైఫ్ క్యారెక్టర్ పోషించబోతున్నారు. ఇప్పటికే సినిమా టీజర్ విడుదలవ్వగా... సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా తెలంగాణా హక్కులను వరంగర్ శ్రీను చేజిక్కించుకున్నారు. దేశంలోనే తొలిసారి క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాగా ప్లేబ్యాక్ ఇప్పటికే అన్నివర్గాల దృష్టినీ ఆకట్టుకుంటోంది.

టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తున్న తొలి తెలుగు చిత్రంగానూ రికార్డు నెలకొల్పిన ప్లే బ్యాక్ లో దినేష్ తేజ్, అనన్యా నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. TV5 మూర్తి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. సినిమాలో ఆయన నిజ జీవితానికి సంబంధించిన పలు అంశాలూ ఇందులో చర్చింబోతున్నట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన అంశాలతో హరి ప్రసాద్ జక్కా తెరకెక్కించిన ప్లే బ్యాక్ ప్రేక్షకులను అదే రేంజ్ లో రంజింపజేస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











