బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటరైన టీవీ9 న్యూస్ రీడర్ దీప్తి
Recommended Video

Bigg Boss Telugu Season 2 : Contestants Background
నాని హోస్ట్‌గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం రాత్రి 9 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొదటి సీజన్ సూపర్ హిట్ కావడం, మంచి ఎంటర్టెన్ అందించడం, సెకండ్ సీజన్లో... ఎన్టీఆర్ స్థానంలో నాని ఎంట్రీ ఇవ్వడం ఈ సారి షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. 16 మంది కంటెస్టెంట్లతో 106 రోజుల పాటు ఈ షో సాగబోతోంది. గత సీజన్ కంటే మరింత మసాలా దట్టించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఎంటర్టెన్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

బిగ్ బాస్ ఇంట్లోకి మూడో కంటెస్టెంటుగా టీవీ 9 న్యూస్ రీడర్ దీప్తి నల్లమోతు ఎంటరయ్యారు. ఈ సందర్భంగా దీప్తి ఏవీ ప్రదర్శించారు. తాను విజయవాడ అమ్మాయినని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తన జీవితంలో ఎంతో ఆనందకర సందర్భమని, ఒక కుమారుడు కూడా ఉన్నట్లు దీప్తి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











