గరుడ వేగ ట్వీట్ రివ్యూ: ఫస్టాఫ్ బాగుంది.. ఓవర్సీస్ రిపోర్ట్
గత రెండేళ్లలో హీరో రాజశేఖర్ నటించిన సినిమాలు విడుదలైన దాఖలాలు లేవు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో రాజశేఖర్ కొంత గ్యాప్ తీసుకొన్నారు. మంచి కథల కోసం వేచి చూశారు. ఈ క్రమంలో రాజశేఖర్ చెప్పిన కథ విన్న తర్వాత గరుడ వేగ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఈ సినిమా నవంబర్ 3న విడుదలకు నోచుకున్నది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సానుకూలమైన రిపోర్ట్ రావడం రాజశేఖర్‌కు ఉపశమనమైన వార్త. ఈ సినిమా గురించి ట్విట్టర్‌లో కొందరు చేసిన పోస్టులు ఇలా ఉన్నాయి.
Recommended Video


ఫస్టాఫ్ చాలా బాగుంది
గరుడవేగ ఫస్టాఫ్ చాలా బాగుంది. సినిమాను ఆద్యంతం ప్రేక్షకులను కట్టిపడేయడంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యారు. ఫస్టాఫ్ చాలా బాగుంది అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.

హార్టీ కంగ్రాట్స్ ప్రవీణ్
హార్టీ కంగ్రాట్స్ ప్రవీణ్ సత్తారు, డాక్టర్ రాజశేఖర్, జీవిత గారు. అమెరికాలో నా ఫ్రెండ్స్ గరుడవేగ చూశారు. వారి నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది. సినిమా బాగుందని చెబుతున్నారు.

గరుడ వేగ బాక్సాఫీస్ హిట్
గరుడ వేగ చిత్రం బాక్సాఫీస్ హిట్ కావడం ఖాయం. టేకింగ్, డీవోపీ. రాజశేఖర్ బాగా నటించాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కేక అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
స్క్రీన్ ప్లే పరుగులు
పీఎస్వీ గరుడ వేగ ఫస్టాఫ్ బాగుంది. స్క్రీన్ ప్లే పరుగులు పెట్టింది. ఇంటర్వెల్ బ్యాంగ్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రాజశేఖర్ ఈజ్ బ్యాక్.
చిత్ర యూనిట్‌కు సెల్యూట్.
ఈ ఏడాది టాలీవుడ్‌కు గోల్డెన్ ఇయర్. ప్రవీణ్ సత్తారు సినిమాను అద్బుతంగా తెరకెక్కించాడు. చిత్ర యూనిట్‌కు సెల్యూట్.

యాక్షన్, థ్రిల్లర్‌గా గరుడవేగ
యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన గరుడవేగ చిత్రంలో సన్నీలియోన్ పాట ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ పాట ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

రాజశేఖర్ కమ్‌బ్యాక్ మూవీ
గరుడ వేగ రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీ అని చెప్పుకొంటున్నారు. గరుడ వేగ చిత్రం విడుదలకు ముందు రాజశేఖర్ దంపతులను మెగాస్టార్ చిరంజీవి కలిసి అభినందనలు తెలిపారు. రాజశేఖర్ తల్లి మరణంతో బాధపడుతున్న రాజశేఖర్‌ను చిరంజీవి పరామర్శించారు.
రియలిస్టిక్‌గా ఉంది.
నాన్ స్టాప్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్. రియలిస్టిక్‌గా ఉంది. రెగ్యులర్ తెలుగు సినిమాల కంటే డిఫరెంట్‌గా ఉంది.
రాజశేఖర్ మళ్లీ హిట్
గరుడ వేగతో డాక్టర్ రాజశేఖర్ మళ్లీ హిట్ కొట్టాడు. గరుడ వేగ అద్భుతంగా ఉంది.
ప్రవీణ్ సత్తారు బ్రిల్లియంట్.
డాక్టర్ రాజశేఖర్ నటించిన గరుడ వేగ చాలా బాగుంది. సినిమాను ప్రవీణ్ సత్తారు మీరు తెరకెక్కించిన విధానం బ్రిల్లియంట్.
మూవీ ఎలా ఉందో గానీ
గరుడ వేగ మూవీ ఎలా ఉందో గానీ సోషల్ మీడియాలో ఈ సినిమాను బాగా లేపుతున్నారు. రాజశేఖర్ గురించి బాగా రాస్తున్నారు.


Click it and Unblock the Notifications











