పండగ మీద వ్యంగ్యంగా ట్విట్టర్ పోస్ట్: వైరల్ అవుతున్న ట్వింకిల్ ఖన్నా ట్వీట్
భర్తలు బాగుండాలంటే ముందుగా వారి జీర్ణప్రక్రియ బాగుండాలని, అలా ఉండాలంటే భార్యలు ఉపవాసం చేస్తే సరిపోదని ట్వింకిల్ ఖన్నా కర్వాచౌత్ పండుగ మీద ట్వీట్ పెట్టింది.
బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా మరోసారి 'కర్వా చౌత్' పండుగపై ట్విటర్‌లో ఫన్నీ కామెంట్ పెట్టింది. నాత్ ఇండియా లో కర్వా చౌత్ పండగ ఎంత ప్రముఖమైందో తెల్సిందేకదా. ఈ సారి ట్వింకిల్ కర్వా చౌత్ మీద నవ్వించే ట్వీట్ పెట్టేసింది. తాజాగా 'కర్వా చౌత్' పర్వదినాన్ని పురస్కరించుకుని ఆమె చేసిన ట్వీట్ ఆలోచన రేకెత్తించేలా, నవ్వుతెప్పించేలా ఆసక్తిగా ఉంది. ఉత్తరాది మహిళలు తమ భర్తలు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కర్వాచౌత్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉపవాసం ఆచరించి, చంద్రోదయం తరువాత భర్త ముఖాన్ని జల్లెడ చాటున చూసి ఆ తర్వాత ఉపవాసం వదులుతారు. దీనిపై ట్వింకిల్ వ్యంగ్యంగా ట్వీట్ పెట్టింది.
భర్తలు బాగుండాలంటే ముందుగా వారి జీర్ణప్రక్రియ బాగుండాలని, అలా ఉండాలంటే భార్యలు ఉపవాసం చేస్తే సరిపోదని ట్వింకిల్ చెప్పింది. భూమిమీద ఎక్కువ కాలం బతికే జంతువులపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు, వాటి జీర్ణక్రియ బాగుండడమే అందుకు కారణమని తేల్చిచెప్పారని ఆమె గుర్తు చేసింది. అంతేకానీ, వాటి భార్యలు కర్వాచౌత్ ఉపవాసం ఉండడం వల్ల అవి ఎక్కువ కాలం బతికి ఉండలేదని ఆమె చమత్కరించింది.
గతేడాది కర్వాచౌత్ సందర్భంగా కూడా ట్వింకిల్ ఇలాంటి ట్వీటే చేసింది. 'ఈ కాలంలో 40 ఏళ్లు దాటగానే చాలామంది మగవారు రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు. అలాంటివారి కోసం భార్యలు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు' అంటూ అప్పట్లో ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, తాజా ట్వీట్ కూడా వైరల్ అయింది.


Click it and Unblock the Notifications











