»   » నెమలి సెక్స్ థెరపీ.... హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా, సోనాక్షి, శృతి సెటైర్లు!

నెమలి సెక్స్ థెరపీ.... హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా, సోనాక్షి, శృతి సెటైర్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రాజస్తాన్ హైకోర్టు జడ్జి ఒకరు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. జాతీయ పక్షి నెమలి సెక్స్ కు దూరంగా ఉంటుందని, అందుకే అది ఎంతో పవిత్రమైనది అని.... అందువల్లే దానిని జాతీయ పక్షిగా ప్రకటించారని సదరు జడ్డి వ్యాఖ్యానించారు.

మగ నెమలి జీవితాంతం బ్రహ్మచర్యంలోనే ఉంటుందని, ఆడ నెమలితో అది సెక్స్ చేయదని, మగ నెమలి కంటి నుండి వచ్చే నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాల్చుతుందని, అందుకే శ్రీకృష్ణుడు నెమలి ఫించాన్ని తన తలపై ధరించేవారని పురాణాల్లోని విషయాలను కూడా జడ్జిగారు ఉఠంకించారు.

జస్టిస్ మహేష్ చంద్ర శర్మ

జస్టిస్ మహేష్ చంద్ర శర్మ

బుధవారం రిటైర్ అయిన జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తన ఆర్డర్ లో నెమలి సెక్స్ గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జిగారు చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో రకరకాల స్పందన వస్తోంది.

పేలుతున్న జోక్స్

జస్టిస్ మహేష్ చంద్ర శర్మ చేసిన ఈ కామెంట్లపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు జోక్స్ పేలుస్తున్నారు. సమ్మర్ వెకేషన్లో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్న బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య, బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా ఫన్నీ ట్వీట్ చేసారు. కామెంట్స్ విన్న తర్వాత హోమ్ సిక్ ఫీలవుతున్నాను, చాలా ఫన్ మిస్సవుతున్నాను అంటూ ట్వీట్ చేసారు. బెస్ట్ జోక్ ఆఫ్ ది ఎపిక్ అంటూ రీ ట్వీట్ చేసారు.

సోనాక్షి సిన్హా

ఈ విషయమై సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా తన రియాక్షన్ తెలుపుతూ.... ‘కొందరు నెమళ్లు సెక్స్ కు దూరంగా ఉంటాయని చెబుతున్నారు. అవి కన్నీళ్లు తాగడం ద్వారా పిల్లలను కంటాయట. వావ్... మైండ్ ఈజ్ బ్లోయింగ్... నెమ్మదిగా చప్పట్లు కొట్టండి అంటూ సెటైరిక్ గా ట్వీట్ చేసారు.

శృతి సేథ్

టెలివిజన్ నటి శృతి సేథ్ స్పందిస్తూ... ఈ విషయమై వరుస ట్వీట్లు చేసారు. తాగడానికి ఎక్కడైనా కన్నీళ్లు దొరుకుతాయని ఎదురు చూస్తున్నాను. ఇంతకంటే బెటర్ గా ఇంటర్నెట్లో ఏమైనా దొరుకుతుందా? అయినా ఈ వ్యక్తిని జడ్జిగా నియమించింది ఎవరు? అంటూ సెటైర్లు వేసారు.

English summary
Have you heard the latest peacocks sex theory? Our witty celebs Twinkle Khanna, Sonakshi Sinha are not far behind as some obvious and some not-so-obvious 'I hate tears' jokes started doing the rounds. "Now this makes me homesick- missing all the fun- Peacocks don't have sex because jungle main mor nacha, kisne dekha?" Twinkle Khanna tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu