ప్యాంటు విప్పమన్న హీరో

అయితే...వేలాది మంది ప్రేక్షకుల ముందు బహిరంగ ప్రదేశంలో ఆయన ఇలా చేయడం అసభ్యకరంగా ఉందంటూ అనిల్ నాయర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెనుదుమారం రేగింది. ఇక దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు..అక్షయ్ ప్రవర్తన నిజంగానే అసభ్యకరంగా ఉన్నట్లు తేలితే ఆయనపై కేసు నమోదుచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అయితే..జరిగిన విషయానికి అక్షయ్ ఆ తర్వాత మీడియా సమక్షంలో క్షమాపణ చెప్పారు.
లెవీస్ కంపెనీ వారి అన్ బటన్డ్ జీన్స్ ప్రమోట్ చెయ్యటానికి అక్షయ్ ఈ పని చేసారు. అయితే సోషల్ వర్కర్ అనీల్ నాయర్ మాత్రం ఇది సమాజ ప్రవర్తనకు విరుద్దమని అంటున్నారు. అయితే కంప్లైంట్ అందుకున్న పోలీసులు మాత్రం డైలమాలో పడిపోయారు. ఈ మ్యాటర్ పై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేసి అరెస్టులు చెయ్యవచ్చా లేదా అన్నది అర్దం కాని స్ధితిలో ఉన్నామని నిపుణుల సలహాలు చేసుకుంటామంటున్నారు. ఇక లాక్మే ఫ్యాషన్ వీక్ హెడ్ అనీల్ చోప్రా మాత్రం ఈ సంఘటనపై పెదవి విప్పటానికి ఇష్టపడటం లేదు. అసలు ఈ మ్యాటర్ గురించి తనకు తెలియదంటున్నాడు. ఎందుకంటే అటు చూస్తే పెద్ద స్టార్. మరో ప్రక్క చట్టం ఆయన్ను ఇరకాటంలో పడేస్తున్నాయి. అయితే నాయర్ మాత్రం అక్షయ్ ఆయనకి ఆయన ఓ బ్రాండ్ కావచ్చు. కానీ ఆయన పద్మశ్రీ విజేత..రోల్ మోడల్..నేను క్షమించలేకపోతున్నాను..ఆ ప్రవర్తనకు అంటున్నాడు.


Click it and Unblock the Notifications











