»   »  లెస్బియనా? టీవీ హీరోయిన్ మరణం వెనక షాకింగ్ ట్విస్ట్

లెస్బియనా? టీవీ హీరోయిన్ మరణం వెనక షాకింగ్ ట్విస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్ కతా: ప్రముఖ బెంగాళీ టీవీ నటి దిశా గంగూలీ అనుమానాస్పద స్థితిలో ఇగీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకక పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు ఈ కేసు నమోదు చేసారు. మరణించడానికి ముందు రోజు వరకు బాయ్ ఫ్రెండుతో జాలీగా షికార్లు కొట్టిన ఆమె అంతలోనే అనుమానాస్పదంగా మరణించడం చర్చనీయాంశం అయింది.

కోల్‌కతా నగరంలోని పర్ణశ్రీ ప్రాంతంలో ఓ అపార్టుమెంటులో దిశా తన తల్లిదండ్రులు, స్నేహితురాలితో కలిసి ఉంటోంది. సంఘటన జరిగిన రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వెళ్లగా, ఆమె స్నేహితురాలు తన సొంతూరైన బారానగర్ కు వెళ్లింది.

Twist in Disha's suicide case

అయితే విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆమె తన ఇంట్లో స్నేహితురాలితో కలిసి ఉంటోంది. ఇద్దరి మధ్య స్వలింగ సంపర్కం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం ఆమె తల్లిదండ్రులకు నచ్చక దిశా స్నేహితురాలిని బలవంతంగా ఇంటి నుండి బయటకు పంపించినట్లు చెబుతున్నారు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని గత కొంత కాలంగా తల్లిదండ్రులు భయపడుతున్నారట.

మరణానికి ముందు రోజు ఆమె తన బాయ్ ఫ్రెండు వివాన్ ఘోష్‌తో ఐపీఎల్ మ్యాచ్ చూసింది. బయటకు కూడా ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే దిశ మరణం అందరినీ షాక్ కు గురి చేసింది. ఇపుడు ఆమె గురించి స్వలింగ సంపర్కం వార్తలు మరింత షాక్ కు గురి చేస్తున్నాయి.

Read more about: disha, tv
English summary
Twist in Disha's suicide case. Disha was in an intimate relationship with her ex-flatmate and fellow TV actress. Her same sex relationship did not go down well with her parents, who forced her roommate to vacate the flat.
Please Wait while comments are loading...