పుష్ప 2 రిలీజ్ డేట్ ట్విస్ట్.. అల్లు అర్జున్ ను వెంటాడుతున్న సెంటిమెంట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ సినిమా నుంచి హీరోలు అంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని మహా అయితే కన్నడ అంతకు మించి తమిళ భూమిపై మాత్రమే క్రేజ్ కనిపించేది. కానీ రాను రాను సినిమాల తాలూకా స్పాన్ పెరుగుతూ వస్తుండడం ఒక భాష కంటెంట్ మరో భాషలో చూస్తుండడంతో మన హీరోల క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పాకింది.
అయితే ఇలా వచ్చినా మార్కెట్ లో దర్శక ధీరుడు రాజమౌళి తన హీరోస్ తో సరికొత్త టర్న్ ని తీసుకొస్తే అలాంటివి ఏవి లేకుండా కేవలం తన సినిమాలతోనే నెమ్మదిగా మంచి క్రేజ్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. అప్పటికే తన సినిమాలకి యూట్యూబ్ లో వందల మిలియన్స్ కొద్దీ వ్యూస్ రావడం తన సినిమాలకి బుల్లితెరపై సాలిడ్ రేటింగ్స్ కూడా నార్త్ లో నమోదు కావడం అల్లు అర్జున్ క్రేజ్ కి ఉత్తరాన ఒక మచ్చు తునకగా అవి మారాయి.

ఈ సంశయంలో తన క్రేజ్ ని టెస్ట్ చేసుకోడానికి అల్లు అర్జున్ చేసిన పాన్ ఇండియా ప్రయత్నమే "పుష్ప". తన ఆల్ టైం హిట్ దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ హ్యాట్రిక్ సినిమా నార్త్ లో అలాంటి కోవిడ్ సమయంలో కూడా 100 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని సంచలనం రేపింది.
ఇక ఇలా ఈ క్రమంలో అనౌన్స్ చేసిన సీక్వెల్ "పుష్ప 2 ది రూల్" పై మంచి క్రేజ్ నెలకొంది. అయితే అప్పుడు పుష్ప 1 ని అనేక అడ్డంకులు నడుమ చివరి నిమిషం వరకు కస్టపడి కంటెంట్ ని పాన్ ఇండియా భాషల్లో చేర్చి డిసెంబర్ లో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు పుష్ప 2 విషయంలో కూడా పార్ట్ 1 కి జరిగినట్టుగానే అనిపిస్తుంది.

అప్పుడు పార్ట్ 1 ని కూడా మొదట ఆగస్ట్ 13 రిలీజ్ కి అనౌన్స్ చేశారు. కానీ ఇది కాస్తా వెళ్లి డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. మళ్ళీ సరిగ్గా పుష్ప 2 ని కూడా ఆగస్ట్ 15 కి లాక్ చేస్తే ఇది కూడా మళ్ళీ డిసెంబర్ కే వాయిదా వేశారు. ఇది యాదృచ్చికమే బాగానే ఉంది కానీ అప్పుడు అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయ్ కాబట్టి ఓకే అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఇంత టైం తీసుకున్నారు.
రెండు మూడు యూనిట్ లు కూడా ఏకకాలంలో పని చేస్తున్నా సినిమా ఇంకా పూర్తి కావడం లేదు. మరి దీనికి కారణం ఏమిటో ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ రిలీజ్ గా అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు అందరినీ డిజప్పాయింట్ చేస్తూ వాయిదా వేశారు. ఇలాంటి ఆలస్యాలు మొదటికే మోసం తీసుకొచ్చిన సందర్భాలు లేకపోలేవు. మరి వీటిని పసిగట్టి విడుదల విషయంలో ఓ పక్కా క్లారిటీ ఉంటేనే డేట్ లు అనౌన్స్ చేసుకుంటే మంచిది అని విశ్లేక్షకుల మాట.


Click it and Unblock the Notifications











