'గోవిందుడు అందరివాడేలే' కథ లో ట్విస్ట్ ఇదే
హైదరాబాద్ : ఇప్పుడు అందరి దృష్టీ మరో పెద్ద సినిమా...గోవిందుడు అందిరి వాడేలే పైన ఉంది. ఈ చిత్రం టీజర్ విడుదలైన నాటి నుంచీ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఇలా ఉంటుంది అని సినిమాలో హీరో బాబాయ్ గా చేస్తున్న శ్రీకాంత్ హింట్ ఇచ్చారు. తన పాత్రకీ రామ్ చరణ్ పాత్రికీ ఉన్న కీలకమైన ట్విస్ట్ కొంత రివిల్ చేసారు. ఆయన చెప్పిన చిత్రం కథేమిటంటే...
ఫారిన్ నుంచి వచ్చిన అభిరామ్ (రామ్‌చరణ్) ఓ కుటుంబంలోని సమస్యలను పరిష్కరించి, ఎలా అందరివాడయ్యాడనేది ఇందులోని ప్రధానాంశం. నేను చరణ్ బాబాయ్‌గా నటించాను. అయితే సినిమాలో నాకు పెళ్లవదు. చరణ్ తండ్రి (రెహమాన్)కూ, నాకూ కథ ప్రకారం చాలా వయసు తేడా ఉంటుంది. నన్నూ, నా జోడీనీ అభిరామ్ ఎలా కలుపుతాడనేది కూడా ఓ పాయింట్. నాకు జోడీగా, మరదలి పాత్రలో కమలినీ ముఖర్జీ నటించింది. అలాగే నన్నూ, మా నాన్న (ప్రకాశ్‌రాజ్)నూ అభిరామ్ ఎలా కలిపాడనేది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఫారిన్‌లో ఉండి రావడం వల్ల సినిమాలో నేనెవరో అతనికి తెలుసు కానీ, అతనెవరో నాకు తెలీదు. నేనతన్ని కొట్టినా, అతను నన్ను కొట్టడు. సెకండాఫ్‌లో అతనెవరనేది నాకు తెలుస్తుంది అన్నారు.
తన పాత్ర గురించి చెప్తూ... నా పాత్ర పేరు బంగారి. పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఉండే పాత్ర. ఎనర్జీ లెవల్స్ హైలో ఉంటాయి. తండ్రిని ఇరిటేట్ చేసే పనులు చేస్తుంటాడు. ఇంట్లో ఉండకుండా వేరే చోట ఉండే పాత్ర అన్నారు.

అలాగే...'చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున.. ఇలా ఆ కాలం హీరోలతో కలసి పని చేశాను. నేటితరం స్టార్ హీరోలతో పనిచేయలేదు. 'గోవిందుడు అందరివాడేలే'తో ఈ జాబితాకు శ్రీకారం చుట్టాను. ఈ సినిమాలో బంగారి అనే పాత్రలో కనిపిస్తాను. నాన్నకు నచ్చని పనులు చేసి కోపం తెప్పిస్తుంటాను. నా పాత్రలో చిన్న నెగిటివ్ షేడ్ కూడా ఉంటుంది. ఇలా చేయడానికి ఒక కారణం కూడా ఉంటుంది. అదేంటి.. ఆ సమస్యను ఎవరు తీర్చారనేది ఆసక్తికరం. సినిమాను కృష్ణవంశీ చాలా అందంగా ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు.
దర్శకుడు మాట్లాడుతూ... ''కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రతీ సన్నివేశంలోనూ తెలుగుదనం ఉట్టిపడుతుంది. రామ్‌చరణ్ విదేశాల్లో పుట్టి పెరిగిన యువకుడి పాత్రలో కనిపిస్తాడు. తనవారికోసం సొంతూరికి వచ్చిన ఓ ఎన్నారై యువకుడు ఎలాంటి సందడిని సృష్టించాడన్నది ఇందులో ఆసక్తికరం. చరణ్ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది. '' అన్నారు.
శ్రీకాంత్, ప్రకాష్‌రాజ్, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ. కూర్పు: నవీన్ నూలి.


Click it and Unblock the Notifications











