LEO: లియో మూవీలో అదిరిపోయే ట్విస్టు, ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా విజయ్ రోల్‌!

విజయ్ దళపతి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం లియో గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్ కు విపరీతమైన స్పందన వచ్చింది. ఈక్రమంలోనే సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ కాగా.. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో త్రిష కథానాయికగా చేయగా... సంజయ్ ద్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ చిత్రం అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అక్టోబర్ 18వ తేదీన యూఎస్ ప్రీమియర్స్ స్టార్ అవుతున్నాయి.

ఈక్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ అద్భుతమైన అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉండగా.. అది వెలుగులోకి వచ్చింది. ఆ ట్విస్ట్ వల్ల ప్రేక్షుకుల కుర్చీలోంచి సినిమా అయిపోయేవరకూ కదల్లేరని తెలుస్తోంది. అయితే ఈ ట్విస్ట్ ను ట్రైలర్ లో చూపించకుండా బాగానే ఎడిట్ చేసినట్లు సమాచారం. అలాగే సంజయ్ దత్ పోషించిన పాత్ర చుట్టూనే కథ సాగుతుందని అంతా అనుకుంటున్నారు. సంజయ్‌దత్ ఈ సినిమాలో విజయ్ కు తండ్రిగా కనిపించబోతున్నాడు. అయితే తండ్రే ఈ చిత్రంలో విలన్ కాబోతున్నాడు.

Twist of Vijays Role in Leo movie leaked: Here is the Interesting details

తండ్రీ, కొడుకుల మధ్య జరిగే గొడవలే లియో సినిమా అసలు కథాంశం అని తెలుస్తోంది. తండ్రీ,కొడుకుల రిలేషన్ చూస్తున్నప్పుడు చాలా ఉద్వేగభరితంగా అనిపిస్తుందని.. సమాచారం. ఈ విషయాలు తెలుసుకున్న అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామనా అని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ఓవర్సీస్ లో దీని టికెట్లు వన్ మిలియన్ డాలర్లకు పైగా అమ్ముడుపోయాయి. మరోవైపు యూకేలో కూడా అత్యధిక ఎక్కువ టికెట్లు అమ్ముడుపోయిన సినిమాగా లియో రికార్డు క్రియే్ చేసింది. గత 30 సంవత్సరాలలో వన్ మిలియన్ డారల్ల మార్కును అందుకున్న విజయ్ తొలిచిత్రం లియో కావడం గమనార్హం. బాలీవుడ్ లో కూడా లియో మొదటి రోజు 1500 టికెట్లు అమ్ముడు పోయాయి. విడుదలకు ముందే ఈ రేంజ్ లో హిట్టు టాక్ సాధిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాకా ఎన్నో కోట్ల వసూలు చేస్తుందో చూడాలి.

Thalapathy Vijay Role In Leo Movie

విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన లియో చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్, పళనిస్వామి నిర్మించగా... అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్టు అవుతుందని.. అందులో ఎలాంటి అనుమానమూ లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X